పెళ్లిళ్లు డౌన్
ABN , First Publish Date - 2020-09-14T10:43:25+05:30 IST
ఏ చిన్న కార్యక్రమైనా డెకరేషన్, ఫొటో, వీడియో గ్రాఫర్లు, క్యాటరింగ్, పూజార్లు తప్పనిసరి. కరోనా రాకముందుకు
సగం రోజులు లాక్‌డౌన్‌లోనే ముగిసిన పెళ్లిళ్ల సీజన్
ఉపాధి కోల్పోయిన డెకరేషన్, ఫొటో, వీడియో గ్రాఫర్లు
దుకాణాల అద్దెల చెల్లింపునకు అవస్థలు
శ్రావణ మాసంలోనూ ఇదే తీరు
ఇప్పుడు మరింత దారుణం
ఎప్పుడు సాధారణ రోజులు వస్తాయో..!
ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న కార్మికులు
శుభకార్యాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. లాక్‌డౌన్‌తో చాలా వరకు వివాహాలు ఆగిపోయాయి. ఆ తరువాత అనుమతి ఇచ్చినా నిబంధనలు పెట్టడంతో సందడి కనిపించలేదు. దీంతో ఫొటో, వీడియో, డెకరేషన్, క్యాటరింగ్ తదితర కార్మికులు ఉపాధి కోల్పోయారు. చివరకు షాపుల అద్దెలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని పలువురు కార్మికులు కోరుతున్నారు.
వనపర్తి పురపాలకం, సెప్టెంబరు 3: ఏ చిన్న కార్యక్రమైనా డెకరేషన్, ఫొటో, వీడియో గ్రాఫర్లు, క్యాటరింగ్, పూజార్లు తప్పనిసరి. కరోనా రాకముందుకు శుభకార్యాలు వైభ వంగా చేసేవారు. కానీ ప్రసుత్తం ఏ కార్యం చేయాలన్నా నిబంధ నలు పాటించాల్సి వస్తోంది. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శుభకార్యాలకు ఒక్క పెళ్లితో ఫొటో, వీడియో గ్రాఫర్, డెకరే షన్, పురోహితులు, క్యాటరింగ్ కార్మికులే కాకుండా ఫంక్షన్ హాళ్లు, బ్యాండ్, డీజేలు, సన్నాయి మేళాలు, కిరాణం, కూర గాయలు, స్వీపర్లు, దినసరి కూలీలు ఇలా అనేక మందికి ఉపాధి లభించేది. ఈ ఏడాది సరిగ్గా పెళ్లిళ్లు లేక కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి ఆయా కుటుంబాలు ఆర్థికం గా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
అద్దెలు భార మయ్యాయి
ఫొటో, డీజే, డెకరేషన్, సప్లయ్ సామాన్ల షాపులకు అద్దె కట్ట లేక కార్మికు లు అల్లా డుతున్నారు. అస లే కరోనా వల్ల గిరాకీ లేకపోవ డంతో కుటుంబ పోషణ భారమైందన్న ఆలోచన ఒక పక్క అయితే మరో పక్క అద్దెలు కట్టడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదని వాపోతున్నారు. తమలాంటి కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని మొరపెట్టు కుంటున్నారు. అద్దెలు వాయిదాల పద్ధతిలో తీసుకోవాలని ప్రభుత్వం సూచించి నప్పటికీ అది ఎక్కడా జరగడం లేదు.
సీజన్ వస్తే మేలు జరిగేది..
జిల్లాలో వీడియో, ఫొటో గ్రాఫర్ వృత్తిపై ఆధా రపడి సుమారు 1500 మంది, పూల డెకరేషన్‌పై 200 మంది, పురోహితులు వంద మంది, వంట కార్మికులు, క్యాట రింగ్ 200 మంద, బ్యాండ్ సన్నాయి 500 మంది ఉన్నారు. అయితే వివాహాలు, శుభకార్యాలు జరిగితే వీరికి ఉపాధి లభిస్తుంది. ఏప్రిల్, మే, ఆగస్టు నెలల్లో కష్టపడితే వచ్చే ఆదాయంతోనే మిగతా పది నెలలు కుటుంబ పోషణ జరిగేది. ఈ ఏడాది మాత్రం కరోనా రూపం లో వీరికి కష్టాలు మొదలయ్యాయి. లాక్ డౌన్ తొలగించినా శుభకార్యాలపై నిబంధన లు కొనసాగుతున్నాయి. దీంతో పది నుంచి 20 మందితో అడపాదడపా పెళ్లిళ్లు జరుగు తున్నా సందడి లేకుండా పోయింది.
చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
సీజన్‌పై ఆధార పడి జీవిస్తున్న మేము ఈ సారి కరోనా రావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సీజన్ వస్తుందని అప్పులు చేసి కొత్త కెమెరాలను తెచ్చుకున్నాం. ప్రతి సంవత్సరం పెళ్లిళ్ల సీజన్‌లో బాగానే జరిగేది. ఈ సారి కరోనా ఉండడం వల్ల మా జీవనం ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఏదోవిధంగా ఆదుకోవాలని వేడుకుంటున్నాం.
- బాలు, ఫొటో గ్రాఫర్