-
-
Home » Telangana » Mahbubnagar » The wages are paid along with meals
-
కూలీలకు భోజనంతో పాటు వేతనం ఇవ్వాలి
ABN , First Publish Date - 2020-04-07T10:15:24+05:30 IST
ప్రస్తుత లాక్‌డౌన్ సందర్భంగా పరిశ్రమలలో పనిచేస్తున్న కూలీలకు భోజనంతో పాటు వేతనం ఇవ్వాల్సిన బాధ్యత

రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్
పోలేపల్లి సెజ్‌లోని పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం
జడ్చర్ల, ఏప్రిల్ 6 : ప్రస్తుత లాక్‌డౌన్ సందర్భంగా పరిశ్రమలలో పనిచేస్తున్న కూలీలకు భోజనంతో పాటు వేతనం ఇవ్వాల్సిన బాధ్యత పరిశ్రమల యాజమాన్యంపై ఉందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జడ్చర్ల మండలం పోలేపల్లి టీఎస్‌ఐఐసీలోని ఎల్ అండ్ టీ పరిశ్రమలలోని సమావేశ మందిరంలో సోమవారం పరిశ్రమల యాజమాన్యం, ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రణ చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకున్నదన్నారు.
ఎలాంటి ఆధారం లేని వారితో పాటు నిరాశ్రయులకు, పేదప్రజలకు, వలసకూలీలకు సహాయసహకారాలు అందిస్తున్నాయని తెలిపారు. విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మానవతాదృక్పథంతో మందులు, వెంటిలేటర్‌ల కొనుగోలుకు పరిశ్రమల యజమానులు ముందుకు రావాలన్నారు.
అనంతరం జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు నిబంధనల ప్రకారం వేతనంతో పాటు ఆహారం, ఇతర అవసరాలు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మిశివకుమార్, అదనపు కలెక్టర్ సీతారామారావుతో పాటు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.