ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య20,705

ABN , First Publish Date - 2020-10-16T06:12:26+05:30 IST

ఎల్‌ఆర్‌ఎస్‌కు జిల్లాలో మంచి స్పందన లభించింది. తుది గడువైన గురువారం నాటికి జిల్లాలోని నాలుగు

ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య20,705

గద్వాల, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌ఆర్‌ఎస్‌కు జిల్లాలో మంచి స్పందన లభించింది. తుది గడువైన గురువారం నాటికి జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీ ల్లో 20,705 మంది దరఖాస్తు చేసుకున్నా రు. దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన వారితో గురువారం మునిసిపల్‌ కార్యాల యం కిటకిటలాడింది.


పెద్దసంఖ్యలో దరఖాస్తులు

ధరఖాస్తులకు గురువారంతో గడువు ముగియనుండడంతో జనం పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. అయితే 15న మీ సేవలో నమోదు చేయించుకుంటే సరిపోతుంది. దరఖాస్తులు ఒకటి రెండు రోజులు అలస్యంగా ఇచ్చినా ఫర్వాలేదంటున్నారు. దీంతో గురువారం సాయంత్రం వరకు గద్వాల మునిసిపాలిటీలో 12,068 ధరఖాస్తులు వచ్చాయి. రేపటి వరకు ఈ సంఖ్య 14 వేలకు చేరుకునే అవకాశముంది. ఇదే తీరులో అయిజలో 6,798, వడ్డేపల్లిలో, 1568, అలంపూర్‌లో 271 ధరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా జిల్లాలో 23 వేల ధరఖాస్తులు వస్తాయని అంచనా వేశారు. మొత్తంగా నాలుగు మునిసిపాలిటీలకు రూ.2.30 కోట్ల ఆదాయం రానుందని అంచనా వేశారు.

Updated Date - 2020-10-16T06:12:26+05:30 IST