-
-
Home » Telangana » Mahbubnagar » The Minister congratulating the donors
-
దాతలను అభినందించిన మంత్రి
ABN , First Publish Date - 2020-04-07T10:16:02+05:30 IST
లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలకు అత్యసవర సేవలు అందిస్తున్న పోలీసులు, మునిసిపాలిటీసిబ్బంది మెడికల్ సిబ్బందికి

రాజేంద్రనగర్ : లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలకు అత్యసవర సేవలు అందిస్తున్న పోలీసులు, మునిసిపాలిటీసిబ్బంది మెడికల్ సిబ్బందికి దాతలు అందజేస్తున్న భోజనాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. పట్టణంలోని శాలిమార్ ఫంక్షన్‌హాల్లో తయారు చేసే భోజన కేంద్రాలు ఆయన సందర్శించారు. ఆపత్కాలంలో దాతలు ముందుకొచ్చి తమ వంతు సహాయం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. పట్టణంలోని గోల్‌మస్జీద్‌లో కౌన్సిలర్ సూరయబేగం ఆఽధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన అబ్దుల్ షామీమ్‌కు రూ. 2 లక్షల ఎల్‌ఓసీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అందజేశారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జరుగుతున్న జంక్షన్‌రోడ్డు విస్తరణ పనులను మంత్రి పరిశీలించారు.