పట్టభద్రులను పట్టించుకోని ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-10-04T09:20:34+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని పట్టభద్రులను పట్టించుకున్న పాపాన పోలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు

పట్టభద్రులను పట్టించుకోని ప్రభుత్వం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌


 భగీరథ కాలనీ, అక్టోబరు 3: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని పట్టభద్రులను పట్టించుకున్న పాపాన పోలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌ అన్నారు. శనివారం పట్టణంలోని 9వ వార్డు ధనలక్ష్మి కాలనీలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరేళ్లుగా ఒక్క ప్రభుత్వ ఉపాధ్యా య పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. డిగ్రీలు, పీజీలు చేసి ఉద్యోగాల కోసం వేచి చూసిన యువతకు నమ్మకం లేకుండా పోయిం దన్నారు. చదువుకున్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల ముందు చెప్పిన ముఖ్య మంత్రి కేసీఆర్‌ విస్మరించారన్నారు.


కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రోడ్డున పడేశారన్నారు. కొవిడ్‌-19 వల్ల ప్రైవేట్‌ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్స్‌కు జీతాలులేఏక, వేరే చోట ఉపాధి దొరక్క ఇబ్బం దులు పడుతున్నారన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వనికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో పడాకుల బాలరాజు, జయశ్రీ, అంజమ్మ, జిల్లా నాయకులు కృష్ణవర్ధన్‌ రెడ్డి, పి.సత్యం, వీర బ్రహ్మ చారి, పి.శ్రీనివాస్‌రెడ్డి, అచ్చుగట్ల అంజయ్య, చెన్న వీరయ్య, రామాంజనే యులు, పాండు రంగారెడ్డి, పోతుల రాజేందర్‌రెడ్డి, సురెందర్‌రెడ్డి, సుధాకర్‌, సత్యంయాదవ్‌, కిరణ్‌కు మార్‌ రెడ్డి, మహేష్‌, సంపత్‌కుమార్‌, హరికృష్ణ, నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-04T09:20:34+05:30 IST