రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి

ABN , First Publish Date - 2020-12-28T03:22:04+05:30 IST

కేంద్ర ప్రభు త్వం అ నుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానా లను ప్రతిఘ టించాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు వార్ల వెంక టయ్య పిలుపునిచ్చారు.

రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
తాడూరులో పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న సీపీఐ రాష్ట్ర నాయకులు వార్ల వెంకటయ్య

- సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు వార్ల వెంకటయ్య 

తాడూరు, డిసెంబరు 27 : కేంద్ర ప్రభు త్వం అ నుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానా లను ప్రతిఘ టించాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు వార్ల వెంక టయ్య పిలుపునిచ్చారు. తాడూరు మండల కేంద్రం లో ఆదివారం భారత కమ్యూనిస్టు పార్టీ 95వ వ్య వస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభు త్వం రెండవసారి అధికారం చేపట్టాక దేశాన్ని అ మ్మకానికి పెట్టిందన్నారు. అన్ని ధరలను పెంచి ప్ర జల నడ్డి విరిచిందన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి నిరంజన్‌ గౌడ్‌, చంద్రయ్యగౌడ్‌, కురుమూ ర్తి, కొండన్న గౌడ్‌, ఎర్రమశన్న, తిరుమలయ్య, కోడె ల శ్రీశైలం, కొంకరి శ్రీనివాసులు, సత్యం, శివ, గ ణే ష్‌, రమేష్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు. 

కొత్త చట్టాలను రద్దు చేయాలి


తెలకపల్లి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సీ పీఐ పార్టీ నాగర్‌కర్నూల్‌ జిల్లా కార్యవర్గ సభ్యుడు కే.కేశవులుగౌడ్‌ డిమాండ్‌ చేశారు. సీపీఐ 95వ ఆ విర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మండల పరిధిలోని గౌరెడ్డిపల్లి, కమ్మారెడ్డిపల్లి, ఆలేరు గ్రా మాల్లో సీపీఐ పార్టీ జెండాను ఆవిష్కరించారు.  కా ర్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు శంకర్‌ గౌడ్‌, మండల కార్యదర్శి రవీందర్‌పాల్గొన్నారు. 

రైతుల ఉసురుతీస్తున్న మోదీ సర్కార్‌



కందనూలు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి న మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌. శ్రీనివాస్‌ డి మాండ్‌ చేశారు.  నాగర్‌కర్నూల్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీపార్కులో ఆది వారం నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-28T03:22:04+05:30 IST