-
-
Home » Telangana » Mahbubnagar » The farmer must make a loan in the same amount
-
ఒకే దఫాలో రైతు రుణమాఫీ చేయాలి
ABN , First Publish Date - 2020-05-18T10:49:07+05:30 IST
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ నాయకులు కోరారు.

ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ప్లకార్డుల ప్రదర్శన
నారాయణపేటరూరల్/ మక్తల్‌టౌన్, మే 17 : దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ నాయకులు కోరారు. ఆదివారం మండలంలోని కోటకొండ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వాను కోరారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాము, జిల్లానాయకులు హాజిమలాంగ్, ఎదురింటి రాములు, మండల నాయకులు రఫీ, నీలి దామోదర్, రైతులు నాగప్ప, వెంకటప్ప, దస్తప్ప పాల్గొన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలోని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో ప్ల కార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని ఒకే దఫాలో చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కిరణ్, అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భగవంతు, పీడీఎస్‌యూ నాయకులు భాస్కర్, అజీబుర్ రహెమాన్, జానీ, నర్సిములు పాల్గొన్నారు.