సీఎం దూరదృష్టితోనే వలసలు ఆగాయి

ABN , First Publish Date - 2020-12-28T03:25:42+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టితోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో వలసలు ఆగిపోయాయని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

సీఎం దూరదృష్టితోనే వలసలు ఆగాయి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- ఎక్సైజ్‌, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

అచ్చంపేట టౌన్‌, డిసెంబరు27: ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టితోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో వలసలు ఆగిపోయాయని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎ మ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో క్రికెట్‌ టోర్నమెంటు ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలపై ముఖ్యమంత్రికి ప్రత్యేక దృష్టి ఉందని, రాష్ట్రంలో ఇప్పటికే 48 మిని స్టేడియాలు పూర్తిచేశామని త్వరలోనే మిగతావాటిని పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో తాగు,సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారని, ఆయన మదిలో పేదలకు కావాల్సిన ఎన్నో సంక్షేమ పథకాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పాతబజారు, సాయిరాం కాలనీలలోని పలు సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థానలు చేశారు. ప్రభు త్వ విప్‌, ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ నల్లమలలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేసేందుకు ప్రత్యేక చొరవచూపాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కోరారు. రూ. కోటి నిఽధులు విడుదల చేస్తే స్టేడియం పనులు పూర్తవుతాయన్నారు. అదేవిధంగా సాగునీటి పనులను పూర్తిచేసేందుకు  సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్‌, మునిసిపల్‌ చైర్మన్‌ తులసీరాం, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నర్సింహగౌడ్‌, నాయకులు రాజేందర్‌, రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-28T03:25:42+05:30 IST