హెచ్చార్సీని ఆశ్రయించిన దంపతులు

ABN , First Publish Date - 2020-12-18T04:34:34+05:30 IST

టీఆర్‌ఎస్‌ మండల నాయకుల నుంచి తమకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం మండల పరిధిలోని చిన్నమునుగా ల్‌చెడ్‌కు చెందిన హారతి, రవి దంపతులు మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

హెచ్చార్సీని ఆశ్రయించిన దంపతులు

అడ్డాకుల, డిసెంబరు 17 : టీఆర్‌ఎస్‌ మండల నాయకుల నుంచి తమకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం మండల పరిధిలోని చిన్నమునుగా ల్‌చెడ్‌కు చెందిన హారతి, రవి దంపతులు మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఫిర్యా దులోని వివరాల ప్రకారం.. చిన్నమునుగాల్‌చెడ్‌కు చెందిన పి.హారతిపై నవంబరు 9న రైతువేదిక స్థల వివాదంలో మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు దాడికి ప్రయత్నించగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టించుకో కపోవడంతో నవం బరు 21న మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, డిసెంబరు 28న జిల్లా ఎస్పీకి, సంబంధిత వ్యక్తులకు హెచ్చార్సీ నోటీసులు పంపించిందని, దాంతో ఆగ్రహించిన అడ్డాకుల నాయకులు మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ బూతులు తి డుతూ తమపై భౌతికదాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. హెచ్చార్సీకి చేసిన ఫిర్యాదు ను వాపసుతీసుకోవాలని భయభ్రాంతులకుగురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-18T04:34:34+05:30 IST