-
-
Home » Telangana » Mahbubnagar » The country must be made drug free
-
మత్తు మందులేని దేశంగా తీర్చిదిద్దాలి
ABN , First Publish Date - 2020-10-07T05:54:06+05:30 IST
‘మత్తు మందుల వ్యసనాన్ని నిర్మూలించి, దేశాన్ని మత్తు మందులేని భారత్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర సమాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ

కలెక్టర్ ఎస్.వెంకట్రావు
కలెక్టరేట్, అక్టోబరు 6: ‘మత్తు మందుల వ్యసనాన్ని నిర్మూలించి, దేశాన్ని మత్తు మందులేని భారత్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర సమాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. అందుకు మన మంతా సిద్ధం కావాలి’ అని కలెక్టర్ ఎస్.వెంకట్రావు పిలుపు నిచ్చారు. మంగళవారం కలెక్టర్‌లోని తన ఛాంబర్‌లో నషా ముక్త్ భారత్ ప్రచార కమిటీ మొదటి సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్తు మందుల వినియోగం వ్యక్తులపై, సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. మత్తు మందుల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు తెలిపేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆ మందులు తీసుకోకుండా ముందు జాగ్రత్తగా అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. నషా ముక్త్ భారత్ రూపొందించిన వార్షిక ప్రణాళికలో 272 జిల్లాల్లో కార్యాచరణ అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించిందని, అందులో మహబూబ్‌నగర్, హైదరా బాద్, అదిలాబాద్, ఖమ్మం జిల్లాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింద న్నారు.
కమిటీలో తనతోపాటు ఎస్పీ, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ జడ్జి, డీఎంహెచ్‌ఓ, జిల్లా సంక్షేమాధికారి, విద్యాశాఖాధికారి, సీడీపీఓ, నామినేట్ చేయబడిన ఇద్దరు ఎన్‌జీఓలు ఉంటారని తెలిపారు. కమిటీ జిల్లా స్థాయిలో పాఠశాలలు, కళాశాలల విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులకు వ్యసనాలపై అవగాహన కల్పించాలన్నారు. మందులు వినియోగించే వారిని గుర్తించి వారికి చికిత్స, కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. విద్యా సంస్థలకు 100 మీటర్లలోపు ఎవరూ సిగరెట్లు కాల్చడం, అమ్మడం చేయొద్దన్నారు. ఈ విషయంలో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. ఈనెల 15న జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలి పారు. వచ్చే నెలలో వర్క్‌షాపులు నిర్వహించేందుకు ప్రణళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఒక్కో నియోజకవర్గంలో 3 టాస్కోఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశానికి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి సబ్ జడ్జి వెంకట్రామన్, పీయూ రిజిస్ట్రార్ పిండి పవన్‌కుమార్, నషా ముక్త్‌భారత్ రాష్ట్ర కోఆర్డినేటర్ హరిత, జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి, జిల్లా విద్యాశాఖ అధికారి ఉషారాణి, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ క్రిష్ణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, ఇంటర్ విద్యాశాఖ అధికారి, 104 వాహనాల సమన్వయ అధికారి వేణుగోపాల్‌రెడ్డి, తిరుపతిరావు హాజర య్యారు.