మద్దతు ధర ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే

ABN , First Publish Date - 2020-12-29T03:56:14+05:30 IST

రైతులు పండించిన ధాన్యానికి మద్ద తు ధర అమలు పరిచే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు.

మద్దతు ధర ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే
మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రమాణం చేస్తున్న భాస్కర కుమారి

- పేట మార్కెట్‌లో కంది కొనుగోలు కేంద్రానికి అనుమతి

- రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి

- మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా భాస్కర కుమారి ప్రమాణం

నారాయణపేట టౌన్‌, డిసెంబరు 28: రైతులు పండించిన ధాన్యానికి మద్ద తు ధర అమలు పరిచే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వ్యవసా య మార్కెట్‌ యార్డులో నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రెడ్డి అధ్యక్షత వహించారు.  ముఖ్య అతిథులుగా మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, వైస్‌ చైర్మన్‌ సురేఖ, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ధరలను ని యంత్రించే అధికారముంటుందని ఆ ధరలను అమలు పరచడం, కొనుగోలు చేయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఎప్పుడూ  రైతుల పక్షపాతే అన్నారు. కందులను పూర్తిగా కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి నిరంజన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డితో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నారాయణపేట నియోజక వర్గానికి సాగు నీరందించా లన్నదే  ధ్యేయమని ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రెడ్డి అన్నారు.  

మార్కెట్‌ యార్డు చైర్‌ పర్సన్‌గా  భాస్కర కుమారి ప్రమాణ స్వీకారం

నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డు పాలక వర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేసింది. మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌గా భాస్కర కుమారి, వైస్‌ చైర్మన్‌గా కన్న జగదీశ్‌, సభ్యులుగా గట్టు రాఘవరెడ్డి, భగవంత్‌ రెడ్డి, ఆహ్మద్‌ హుస్సెన్‌, కతలప్ప, సి.సుదుర్శన్‌, జగదీశ్వర్‌, సాయిబన్న, శివారెడ్డితో మార్కెట్‌ శాఖ డీఎం బాలమణి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమం లో మార్కెటింగ్‌ శాఖ డీడీఎం పద్మహర్ష, వ్యవసాయ జిల్లా అధికారి జాన్‌ సుధాకర్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ హరినారాయణ భట్టడ్‌, విండో అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, జడ్పీటీసీలు అంజలి, అశోక్‌ గౌడ్‌, ఎంపీపీలు ఏ.శ్రీనివాస్‌ రెడ్డి, న ర్సప్ప, శ్రీకళ, నాయకులు విఠల్‌రావు ఆర్య, తదితరులు పాల్గొన్నారు.

- నారాయణపేట మండలం జాజాపూర్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకులు మంత్రుల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 

Updated Date - 2020-12-29T03:56:14+05:30 IST