ఉపాధ్యాయుల అరెస్టు సరికాదు

ABN , First Publish Date - 2020-12-30T03:28:01+05:30 IST

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన ధర్నాకు వెళ్తున్న వారిని మధ్యలోనే అరెస్టు చేయడం సరికాదని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేష్‌, రవికుమార్‌ అన్నారు.

ఉపాధ్యాయుల అరెస్టు సరికాదు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, డిసెంబరు 29: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన ధర్నాకు వెళ్తున్న వారిని మధ్యలోనే అరెస్టు చేయడం సరికాదని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేష్‌, రవికుమార్‌ అన్నారు. ధర్నాకు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెళ్లారు. మండల కేంద్రాల్లో నాయకులను అరెస్టు చేశారు.


చిన్నచింతకుంటలో..

చిన్నచింతకుంట: హైదరాబాద్‌లో చేపట్టిన మహా ధర్నా కోసం వెళ్తున్న టీఎస్‌యూటీఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్‌, కార్యదర్శి మౌలానాను పోలీసులు అరెస్టు చేయటాన్ని టీఎస్‌యూటీఎఫ్‌ ఒక ప్రకటనలో ఖండించింది. ఖండించిన వారిలో జిల్లా ఉపాధ్యక్షురాలు ఉమాదేవి, కార్యదర్శి భాస్కర్‌, మండల అధ్యక్షురాలు జయంతి ఉన్నారు.


మిడ్జిల్‌లో..

మిడ్జిల్‌: యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద మంగళవారం నిర్వహించిన మహాధర్నాకు మండలం నుంచి యూటీఎఫ్‌ నాయకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. వెళ్లిన వారిలో నాయకులు ఆర్‌.నర్సిములు, వెంకటయ్య, లక్ష్మయ్య, శ్రీనివాసులు, వసంత్‌, ప్రభావతి, రమేష్‌గౌడ్‌, వసంత్‌కుమార్‌, హర్యా, రవికుమార్‌ ఉన్నారు.

Updated Date - 2020-12-30T03:28:01+05:30 IST