తాపీ మేస్త్రీ బలవన్మరణం

ABN , First Publish Date - 2020-12-20T02:54:28+05:30 IST

మండల కేంద్రమైన లింగాలకు చెంది న తాపీ మేస్త్రీ రాత్లావత్‌ సోమ్లానాయక్‌(40) అనే వ్యక్తి శనివారం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది.

తాపీ మేస్త్రీ బలవన్మరణం
ఆందోళనను అడ్డుకుంటున్న పోలీసులు

- అవమానించిన వ్యక్తులను శిక్షించాలని  కుటుంబ సభ్యుల డిమాండ్‌

-  మృతదేహంతో ఆందోళన

అచ్చంపేట, డిసెంబరు 19: మండల కేంద్రమైన లింగాలకు చెంది న తాపీ మేస్త్రీ రాత్లావత్‌ సోమ్లానాయక్‌(40) అనే వ్యక్తి శనివారం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల 17న ఓ ఇంటి నిర్మాణం విషయంలో లింగాలకు చెందిన వడ్డెర లక్ష్మయ్య (హైదరాబాద్‌లో మెట్రోలో ఏఎస్‌ఐ) అనే వ్యక్తి కుటుంబ సభ్యులు మేస్త్రీ ఉంటున్న ఇంటికి వచ్చి కులం పేరుతో దూషించడమే గాక దౌ ర్జన్యం చేసి వెళ్లినట్లు తెలిపారు. కాగా ఈ సంఘటనను మనసులో పెట్టుకున్న మేస్త్రీ శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఇంటి వెనుకాల ఉన్న బాత్‌ రూంలోకి వెళ్లి ఉరి వేసుకొన్నాడు. ఇది గమనిం చిన కుటుంబ సభ్యులు రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య మంగమ్మ, ఇద్దరు సంతానం ఉన్నారు. ఇదిలా ఉండగా, మేస్త్రీ మృతికి కారణమైన వడ్డెర లక్ష్మయ్యను అతని కుటుంబ సభ్యులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ మృ తదేహంతో పాత బస్టాండు కూడలిలో నాల్గు గంటల పాటు బైఠా యించారు. ఆందోళన విషయం తెలుసుకున్న బల్మూర్‌, ఉప్పునుంతల ఎస్‌ఐలు వీరబాబు, రమేష్‌ లింగాలకు చేరుకుని పరిస్థితి సమీక్షించా రు. మృతుని కుటుంబ సభ్యులకు పోలీసులు నచ్చ చెప్పినప్పటికీ ఆం దోళన విరమించలేదు. చివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుపడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అచ్చంపేట ప్రభుత్వ ఆ సుపత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు సీఐ రామకృ ష్ణ పర్యవేక్షణలో  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపారు.  





Updated Date - 2020-12-20T02:54:28+05:30 IST