విద్యుదాఘాతంతో ఆలయ ఉద్యోగి మృతి

ABN , First Publish Date - 2020-12-31T03:19:00+05:30 IST

ఆదిశిలా క్షేత్రంలోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం విషాదం చోటుచేసుకున్నది.

విద్యుదాఘాతంతో ఆలయ ఉద్యోగి మృతి

- మల్దకల్ ‌ఆలయంలో దుర్ఘటన  

   మల్దకల్‌, డిసెంబర్‌ 30: ఆదిశిలా క్షేత్రంలోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం విషాదం చోటుచేసుకున్నది. క్షేత్రంలో మంగళవారం రాత్రి నిర్వహించిన తెప్సోత్సవం కోసం మోటారు సాయంతో కోనేరులో నీటిని నింపారు. వేడుక పూర్తి కావడంతో బుధవారం ఉదయం 7.30గంటల సమయంలో మోటర్‌ను బయటకు తీసేందుకు ఆలయ ఉద్యోగులు బి.నర్సింహ (30), పీ.నర్సింహ, లక్ష్మయ్య, తేజ కోనేరు దగ్గరకు వెళ్లారు. మోటర్‌ను బయటకు తీసే సమయంలో విద్యుదాఘాతం సంభవించడంతో బీ.నర్సింహ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గద్వాల ఏరియా ఆస్పత్రిలో పరామర్శించారు.  బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Updated Date - 2020-12-31T03:19:00+05:30 IST