తెలంగాణ అభివృద్ధి సీఎం ఆకాంక్ష

ABN , First Publish Date - 2020-09-14T10:50:25+05:30 IST

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష అని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని మరికల్‌, కిష్టంపల్లి, చాకల్‌పల్లి గ్రామాల్లో పర్యటించారు

తెలంగాణ అభివృద్ధి సీఎం ఆకాంక్ష

పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన


నవాబ్‌పేట, సెప్టెంబరు 13: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష అని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని మరికల్‌, కిష్టంపల్లి, చాకల్‌పల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్‌లో తెలంగాణ ఎడారిగా మారి, ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కరువైందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ నాయ కత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. పరిగి నియోజకవ ర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టిన ట్లు తెలిపారు. రెవెన్యూ శాఖలో అనేక మార్పులు తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం నూతన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మరికల్‌ను మండల కేంద్రం చేయాలని సర్పంచ్‌ పాండు రంగయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల ఏర్పాటుకు తగిన అను కూలతలను పరిశీలించి, నిర్ణయం తీసుకుంటామన్నారు. అనంతరం కిష్టంపల్లిలో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి, అక్కడే మొక్క లు నాటారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ నర్సింహులు, మల్కాపూర్‌ సుధాకర్‌ రెడ్డి, పాండు రంగయ్య, మధుసూదన్‌రెడ్డి, కృష్ణగౌడ్‌, శ్రీనివాస్‌ రెడ్డి, గోపాల్‌ గౌడ్‌, ప్రతాప్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-14T10:50:25+05:30 IST