జాతీయ స్థాయి కబడ్డీ ఛాంపియన్ షిప్‌కు..విద్యార్థుల ఎంపిక
ABN , First Publish Date - 2020-03-02T11:50:39+05:30 IST
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈనెల 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరుగనున్న 67వ సీనియర్ జాతీయ స్థాయి కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలకు అంజి,

ఊర్కొండ: రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈనెల 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరుగనున్న 67వ సీనియర్ జాతీయ స్థాయి కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలకు అంజి, గణేశ్ ఎంపికైనట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి, అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, యాదయ్యగౌడ్ పేర్కొన్నారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరిగిన 67వ రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపియన్ షిప్‌లో ప్రతిభ కనబర్చిన అంజి, గణేష్ జాతీయ స్థాయికి ఎంపికయ్యారన్నారు. జాతీయ స్థాయితో పాటు హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ ప్రో కబడ్డీలో అంజి వరంగల్ వారియర్స్ తరపున, గణేశ్ గద్వాల గ్లాడియెటర్స్ తరపున పాల్గొంటున్నారని తెలిపారు. వీరి ఎంపికకు సహకరించిన కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి జగదీష్‌యాదవ్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, కురుమూర్తిగౌడ్‌కు అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలిపారు.