ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్..?
ABN , First Publish Date - 2020-12-14T02:48:23+05:30 IST
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభు త్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఉమ్మడి జిల్లాలో మూడు వేలకుపైగా ఖాళీలు
సీఎం కేసీఆర్ ప్రకటనతో నిద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు
మహబూబ్‌నగర్, విద్యావిభాగం డిసెంబ రు 13: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభు త్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగుల నుంచి తెలంగా ణ ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో ఈ మేర కు సర్కారు ఖాళీలను భర్తీ చేయడానికి పూనుకున్నట్టు సమాచారం. దుబ్బాక ఉప ఎన్నికలో ఓడిపోవడం, జీహెచ్‌ఎంసీ ఎన్నిక ల్లో అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవ డంతో ప్రభుత్వ దిగివచ్చిందనే చెప్పాలి. అం తేగాకుండా వచ్చే ఏడాది జరిగే పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు ఉండడంతో నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని గుర్తించి పోస్టులను భర్తీ చేయనున్నట్టు స్పష్టమవుతోంది. తాజాగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల ఖాళీ వివరాలు తీసుకోవా లని ముఖ్యమంత్రి కేసీఆర్ సీయస్‌గా ఆదే శించినట్లు సమాచారం. దీంట్లో అత్యధికంగా టీచర్ పోస్టులే ఉన్నాయని తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు మూడు వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీ గా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబెతున్నా యి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో నిరు ద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మొత్తంగా కొత్త ఏడాదిలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందని నిరుద్యోగులు భావిస్తున్నారు.