కదం తొక్కిన కార్మిక లోకం

ABN , First Publish Date - 2020-11-27T03:45:28+05:30 IST

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక లోకం కదం తొక్కిందని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాము, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామ్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి కొండన్న అన్నారు.

కదం తొక్కిన కార్మిక లోకం
నారాయణపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

నారాయణపేట టౌన్‌, మక్తల్‌/ మాగనూర్‌/ దామరగిద్ద, నవంబరు 26: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక లోకం కదం తొక్కిందని  సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాము, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామ్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి కొండన్న అన్నారు. స్వార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని పార్కు ముందు చేపట్టిన ధర్నాలో వారు మాట్లాడారు.  సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రామ్‌, ఇప్ట్యూ నరసింహా, వ్యవసాయ కార్మిక సంఘం గోపాల్‌ పాల్గొన్నారు. వీరి సమ్మెకు టీడీపీ అనుబంధం టీఎన్‌టీయూసీ తరపున నాయకులు మద్దతు పలికారు.  మక్తల్‌ పట్టణంలో ఐఎఫ్‌టీయూ, ఏఐటీయూసీ, సీఐటీయూ కార్మిక సంఘాల ఆధ్వ ర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయ కులు కొండన్న, ఐఎఫ్‌టీయూ కిరణ్‌ మాట్లాడారు.  ఏఐకేఎంఎస్‌ జిల్లా ఉపాధ్య క్షుడు భగవంతు, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్‌, నాయకులు కర్రెం క్రిష్ణ,  మహేశ్వరమ్మ, అమ్మక్క పాల్గొన్నారు. మాగనూర్‌ మండల కేం ద్రంలో వామపక్షాల సంఘాల ఆధ్వర్యంలో మాగనూర్‌ అంతర్జాతీయ రహ దారిపై రాస్తోరోకో నిర్వహించారు. నాయకులు భాస్కర్‌, ఆనంద్‌, ఎఐకేఎం నాయకులు వెంకటేష్‌, మల్లేష్‌, శరణప్ప, ఉన్నారు. దామరగిద్దలోని అంబేడ్కర్‌ చౌరస్తా దగ్గర సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు.  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-11-27T03:45:28+05:30 IST