విజేతలకు బహుమతులను అందిస్తున్న ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-12-04T04:19:50+05:30 IST

యువకులు ఆటల్లో రాణించాలని ఎమ్మెల్యే రాజేంద ర్‌రెడ్డి అన్నారు.

విజేతలకు బహుమతులను అందిస్తున్న ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

ఆటల్లో రాణించాలి : ఎమ్మెల్యే 



ధన్వాడ, డిసెంబరు 3 : యువకులు ఆటల్లో రాణించాలని ఎమ్మెల్యే రాజేంద ర్‌రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడలో క్రికెట్‌ పోటీల్లో విజేతలైన వారికి బహు మతులను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేం దర్‌రెడ్డి మాట్లాడుతూ ఓడిన వారు నిరుత్సాహపడకుండా గెలుపునకు ప్రయత్నం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువత సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తోందన్నారు. అనంతరం విజేత జట్లకు బహుమతులను అందించారు. మొదటి బహుమతి మరికల్‌ క్రికెట్‌ జట్టుకు రూ.5000, రెండవ బహుమతి కంసాన్‌పల్లి జట్టుకు రూ.25000 ఎమ్మెల్యే అందించారు.  ఆటల్లో ప్రతిభ కనబ ర్చిన క్రీడాకారులకు ఎమ్మెల్యే బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ చిట్టెం అమరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, విండో చైర్మన్‌ వెంకట్రామ్‌రెడ్డితో, మత్స్యపారిశ్రమిక సహకార సంఘం అధ్యక్షుడు నీరటి నర్సింములు నాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:19:50+05:30 IST