వైభవంగా వైకుంఠ ఏకాదశి

ABN , First Publish Date - 2020-12-26T03:19:33+05:30 IST

జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ముక్కోటి ఏకాదశి సందర్బంగా వైష్ణవాల యా ల్లో భక్తుల సందడి నెలకొన్నది.

వైభవంగా వైకుంఠ ఏకాదశి
వనపర్తిలో ఉత్తర ద్వార దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు

ఉత్తర ద్వార దర్శనం కోసం పోటెత్తిన భక్తులు

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, డిసెంబరు 25 : జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ముక్కోటి ఏకాదశి సందర్బంగా వైష్ణవాల యా ల్లో భక్తుల సందడి నెలకొన్నది. ఉత్తరాద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకో వడానికి జనాలు పోటెత్తారు. జిల్లా కేంధ్రంలోని వెంకటేశ్వర దేవాలయంలో ఉదయం 4.30గంటలకు స్వామివారి పల్లకీ ఊరేగింపు జరిపి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ ంంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, వాసంతి దంపతులు ప్రాతకాలంలో ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు జరిపారు.  మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, మాజీ మునిసి పల్‌ చైర్మన్‌ పలుస రమేష్‌గౌడు సైతం స్వామివారిని దర్శనం చేసుకున్నారు. పట్టణంలోని       లక్ష్మీనరసింహా స్వామి, పాండరంగ ఆలయం, రామాలయంలో సైతం ఉత్తర ద్వారదర్శనాలకై భక్తులు భారీగా తరలివచ్చారు.  

కిటకిటలాడిన ఆలయాలు

కొత్తకోట/శ్రీరంగాపురం: వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా శుక్రవారం ఉత్తర ద్వార ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కొత్తకోటలోని కోదండ రా మస్వామి, వెంకటగిరి వేంకటేశ్వరస్వామి, అమడబాకుల వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీరంగాపురంలోని రంగనాయక స్వామి ఆలయంలో ఏకాదశిని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారు జామునే భక్తులు ఆలయానికి తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. 

Updated Date - 2020-12-26T03:19:33+05:30 IST