ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

ABN , First Publish Date - 2020-12-14T02:53:01+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, అందులో భాగంగానే గ్రామాల్లోని డ్రెయినేజీలు, డంపింగ్‌ యార్డుల ను నిర్మిస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

ధరూరు, డిసెంబరు 13: రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, అందులో భాగంగానే గ్రామాల్లోని డ్రెయినేజీలు, డంపింగ్‌ యార్డుల ను నిర్మిస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మం డలంలోని  పారుశెర్ల, భీంపురం గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న డ్రెయినేజీ పనులను ఆయన భూమి పూజ చేసి ప్రారంభించారు.  సీఎం కేసీఆర్‌ గ్రామాభివృద్ధికి ఎ న్నో కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. పల్లెల అభివృద్ధి చెందాలంటే ప్రజల సహకారం అవసరమన్నారు.  సర్పంచ్‌లు సవారమ్మ, పద్మ, రఘువర్ధన్‌రెడ్డి, ప్ర భాకర్‌గౌడు, ఎంపీపీ నజుమున్నిసాబేగం, వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటి చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ వెంకటేష్‌, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, తిమ్మప్ప, జాకీర్‌ పాల్గొన్నారు. మండల కేంద్రంలో స్పోర్ట్స్‌ అండ్‌ ఫుట్‌వేర్‌ షాప్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. 

రైతు ఉద్యమానికి టీఆర్‌ఎస్‌ మద్దతు 

గద్వాల టౌన్‌: ఢిల్లీ శివార్లలో రైతు సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్న ఉద్యమానికి తెలంగాణ తరఫున మద్దతు తెలిపేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి సూచన మేరకు నియోజక వర్గంలోని ఐదు మండలాల్లో ఇంటింటికి తిరిగి ప్రతీ రైతు నుంచి పిడికెడు ధాన్యాన్ని సేకరించి రైతు ఉద్యమానికి అండగా నిలవాలని ని ర్ణయించారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జెమ్మిచేడు చెన్నయ్య, ఎంపీపీ ప్రతాప్‌ గౌ డ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సుభాన్‌, సీనియర్‌ నాయకుడు పరమాల నాగరాజు విలే కర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలతో భవిష్యత్‌లో రైతులకు ఎదురయ్యే ఇబ్బందులను వివ రించి వారి మద్దతు కోరుతామన్నారు. మల్దకల్‌ మండలం నుంచి ఈ ఉద్య మాన్ని సోమవారం ప్రారంభిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికెళ్లి రైతు నుంచి పిడికెడి బియ్యం సేకరణకు సంబందించి కర పత్రాలను విడుదల చేశారు.  మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాబర్‌, చక్రధర్‌ రెడ్డి, రమేశ్‌ నాయుడు, నరహరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-14T02:53:01+05:30 IST