ప్రజావాణికి పది ఫిర్యాదులు
ABN , First Publish Date - 2020-12-29T03:16:12+05:30 IST
పోలీస్ ప్రజా వాణికి సోమవారం ఆయా గ్రామాల నుంచి పది ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ అపూర్వారావు తెలిపారు.
వనపర్తి క్రైం, డిసెంబరు 28: పోలీస్ ప్రజా వాణికి సోమవారం ఆయా గ్రామాల నుంచి పది ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ అపూర్వారావు తెలిపారు. రెండు భూఫిర్యాదులు, మూడు భార్యాభర్తల గొడవ, ఐదు పరస్పర గొడవల ఫిర్యాదులు అందాయన్నారు. సంబంధిత పోలీసు అధికారులు సమస్యను పరిష్కరించాలని ఆదేశించామన్నారు.