సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-12-30T03:29:16+05:30 IST
సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉం డాలని ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ సూచించారు.
- 2020లో కొద్దిగా తగ్గిన క్రైం రేట్
- ఎస్పీ రంజన్ రతన్ కుమార్
గద్వాల, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2020లో క్రైమ్ రేట్ కొద్దిగా తగ్గిందన్నారు. అక్రమ దందాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నామన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగహన కల్పించేందుకు సదస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ద్విచక్రవాహనాలపై వెళ్లే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. ప్రెండ్లీ పోలీస్ దిశగా ముందుకు సాగలన్నదే లక్ష్యమన్నారు. కాకులారంలో విధినిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకున్న వారిపై కేసులు నమోదు చేశామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ కృష్ణతో పాటు వివిధ విభాగాల పోలీసులు ఉన్నారు.