-
-
Home » Telangana » Mahbubnagar » sp checks police vehicles
-
పోలీసు వాహనాల తనిఖీ
ABN , First Publish Date - 2020-12-16T03:09:04+05:30 IST
జిల్లా పోలీసు కార్యాలయంలోని పోలీసు వాహనాలను ఎస్పీ అ పూర్వారావు మంగళవారం తనిఖీచేశారు.

వనపర్తి క్రైం, డిసెంబరు 15: జిల్లా పోలీసు కార్యాలయంలోని పోలీసు వాహనాలను ఎస్పీ అ పూర్వారావు మంగళవారం తనిఖీచేశారు. మోటార్ ట్రాన్స్‌ఫోర్ట్ విభాగం వాహనాల నిర్వహణలో సమర్థవంతంగా పని చేస్తుండడం అభినందనీయమన్నారు. ప్రతీ ఒక్క పోలీసు అధికారి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న వాహనాలను తమ సొంత వాహనాల మాదిరిగా భావించి వాటి నిర్వహణలో జాగ్రత్తలు చేపట్టాలన్నారు. అదనపు ఎస్పీ షాకీర్‌హుస్సేన్, జిల్లా మోటార్ వాహ నాల విభాగం అధికారి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, డ్రైవర్లు, పోలీసు సిబ్బంది ఉన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించడం ద్వారా పోలీసులకు మంచి గుర్తింపు వస్తుందని ఎస్పీ అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలోని సమావేశ భవనంలో మంగళవారం పోలీసు అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. ప్రతీ పోలీసు అధికారి తమ వర్టికల్ పట్ల నిబద్ధతతో పనిచేస్తే తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. డీఎస్పీ కిరణ్‌కుమార్, డీసీఆర్‌బీ సీఐ జమ్ములప్ప, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, సీఐ సూర్యనాయక్, ఆత్మకూర్ సీఐ సీతయ్య, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై వెంకట్, జిల్లాలోని ఎస్సైలు ఉన్నారు.