పార్కుల నిర్మాణాలకై స్థల పరిశీలన

ABN , First Publish Date - 2020-07-14T10:53:41+05:30 IST

కొల్లాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో పార్కుల నిర్మాణానికై మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి స్థల పరిశీలన

పార్కుల నిర్మాణాలకై స్థల పరిశీలన

కొల్లాపూర్‌, జూలై 13 : కొల్లాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో పార్కుల నిర్మాణానికై  మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి స్థల పరిశీలన చేశారు. అందులో భాగంగానే సోమవారం పట్టణంలోని రాజాప్యాలెస్‌ చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో పార్కుల నిర్మాణానికై మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ పెబ్బేటి కృష్ణయ్య, ప్రభుత్వాసుపత్రి నిర్వహణ కమిటీ చైర్మన్‌ కాటం జంబులయ్యలు స్థల పరిశీలన చేశారు.


సింగిల్‌ విండో డైరెక్టర్‌ నర్సింహ, కౌన్సిలర్లు సత్యంయాదవ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు రాము, నాయకులు చంద్రశేఖరాచారి, పబ్బ ఎల్లగౌడ్‌, కర్నె వాసు, గోపాల మల్లయ్య, శ్రీను, కుమ్మరి శేఖర్‌రెడ్డి, రమేష్‌, రవి, కాటం శ్రీనివాస్‌, రాఘవేంద్ర, పుట్టపాగ రాము తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-14T10:53:41+05:30 IST