శిలాఫలకం.. వివాదాస్పదం

ABN , First Publish Date - 2020-12-11T03:45:02+05:30 IST

జిల్లా కేంద్రంలోని మున్నూర్‌ ఫంక్షన్‌ హాల్‌ రోడ్డును 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.15లక్షలతో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు.

శిలాఫలకం.. వివాదాస్పదం
అధికారుల పేర్లు లేని శిలాఫలకం

కందనూలు, డిసెంబరు 10: జిల్లా కేంద్రంలోని మున్నూర్‌ ఫంక్షన్‌ హాల్‌ రోడ్డును 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.15లక్షలతో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు.  ప్రభుత్వ నిధులతో పురపాలక సంఘం పరిధి లో నిర్మిస్తున్న అభివృద్ధి పనులకు ఎక్కడా కూడా అధికారులు, కమిషనర్‌ పేర్లు శిలాఫల కంపై లేకపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ  వివాదాస్పదంపై మునిసిపల్‌ కమిషనర్‌ ను వివరణ కోరగా.. ప్రభుత్వ నిధులైనప్పటికీ శిలాఫలకాన్ని ప్రభుత్వ ఖజానాతో నిర్మించలే దని మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ సొంత ఖర్చులతో నిర్మించుకున్నారని ఆయన తెలిపారు.  


Updated Date - 2020-12-11T03:45:02+05:30 IST