-
-
Home » Telangana » Mahbubnagar » shortfilme macking
-
నల్లమల పర్యాటక లఘుచిత్రం చిత్రీకరణ
ABN , First Publish Date - 2020-12-20T02:58:58+05:30 IST
నాగర్‌కర్నూల్ జిల్లా పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన అటవీశాఖ వారు నిర్మిస్తున్న నల్లమల లఘు చిత్రాన్ని శనివారం నాగర్‌కర్నూల్ కేసరి సముద్రం ట్యాంక్‌బండ్‌పై చిత్రీకరణను జిల్లా కలెక్టర్ ఎల్‌పీ.శర్మన్ ప్రారంభించారు.

- ప్రారంభించిన జిల్లా కలెక్టర్
నాగర్‌కర్నూల్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్ జిల్లా పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన అటవీశాఖ వారు నిర్మిస్తున్న నల్లమల లఘు చిత్రాన్ని శనివారం నాగర్‌కర్నూల్ కేసరి సముద్రం ట్యాంక్‌బండ్‌పై చిత్రీకరణను జిల్లా కలెక్టర్ ఎల్‌పీ.శర్మన్ ప్రారంభించారు. జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను ప్రజలకు చేరువ చేసేలా లఘుచిత్రాన్ని నిర్మించాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా దర్శకునికి సూచించారు. నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమలలో ఉన్న సుందర ప్రదేశాలను చిత్రీకరించి పర్యాటకు లు సందర్శించే విధంగా చిత్రీకరణ జరగాలని కోరారు.