వైభవంగా ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన
ABN , First Publish Date - 2020-03-16T08:12:17+05:30 IST
మండలంలోని రాళ్లచెరువు తండాలో గత మూడురోజులుగా కొనసాగుతున్న విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఆదివారంతో ముగిసాయి.
తిమ్మాజిపేట, మార్చి 15 : మండలంలోని రాళ్లచెరువు తండాలో గత మూడురోజులుగా కొనసాగుతున్న విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఆదివారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఆదివారం నూతనంగా నిర్మించిన శివాలయం, ఆంజనేయస్వామి ఆలయం ఎదుట ధ్వజ స్తంభాల ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శ్రీరామ కోటి జపయజ్ఞం, పూర్ణాహుతి, మహాత్ముతులకు సన్మానం తదితర కార్యక్రమాలు భక్తుల కోలాహాలం మధ్య ఘనంగా నిర్వహించారు. ప్రతి రోజు సాయంత్రం వేళ గిరిజన మహిళల బంజార నృత్యాలు, లంబాడ పాటలు, రాత్రివేళ భజనలు, భక్తి పాటలతో కార్యక్రమం ఆధ్యాంతం ఆహుతులకు ఆకట్టుకుంది. కార్యక్రమంలో సర్పంచ్ గమ్లీ, భజన మండలి సభ్యులు కాంతయ్యగౌడ్, నర్సింహరెడ్డి, సాయిబాబ పాల్గొన్నారు.