గొర్రెల కాపర్ల ఆదాయం పెంచేందుకు కృషి

ABN , First Publish Date - 2020-12-06T04:04:59+05:30 IST

గొర్రెల కాపర్ల ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో భాగంగా గొర్రెలను ఆరోగ్యంగా పెంచేందుకు నట్టల నివారణ మందును వేయిస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

గొర్రెల కాపర్ల ఆదాయం పెంచేందుకు కృషి
ఉచితంగా నట్టల నివారణ మందులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి 



గద్వాల రూరల్‌, డిసెంబరు 5 : గొర్రెల కాపర్ల ఆదాయాన్ని పెంచేందుకు  రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో భాగంగా గొర్రెలను ఆరోగ్యంగా పెంచేందుకు నట్టల నివారణ మందును వేయిస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండలం లోని మదనపల్లిలో శనివారం ఆయన జీవాలకు నట్టల నివారణ మందును తాగించారు. అనంతరం ఎమ్మెల్యే  మా ట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంద న్నారు. మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ వాకిటి సంజీవులు, నాయకులు వెంకటే శ్వర్‌రెడ్డి, సర్వారెడ్డి, ప్రకాష్‌గౌడ్‌, పశు వైధ్యాదికారులు  పాల్గొన్నారు.


  గొర్రెల కాపరులు జాగ్రత్తలు తీసుకోవాలి


మల్దకల్‌:  గొర్రెలకు సీజనల్‌ వ్యాధులు రాకుండా గొర్రెల కాపరు లు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి వెం కటేశ్వర్లు రైతులకు సూచించారు. మండలంలోని నీలిపల్లి, ఉలిగేపల్లి, మల్దకల్‌లో పశువైద్యాధికారి నట్టల నివారణ మందును తాగించారు.  


 ఇబ్బందుల్లేకుండా  చూడాలి


ధరూరు : వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని  భీంపురం, చింతరేవుల, ఉప్పేరు, ఖమ్మంపాడు, గార్లపాడు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఆయన పరి శీలించారు. రైతులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కారానికి కృషిచేస్తామన్నారు.  రాఘవ, జాకీర్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, సర్వారెడ్డి ఉన్నారు. గార్లపాడులో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.  

Updated Date - 2020-12-06T04:04:59+05:30 IST