సేవా, సహకారంతో ముందుకు సాగుదాం

ABN , First Publish Date - 2020-11-20T03:48:04+05:30 IST

సాటి వారికి, సమాజాభి వృద్ధికి తమవంతు సేవా, సహకారంతో ముందుకు సా గాలని ప్రతి వ్యక్తికి మమకారం, ఆత్మీయతలే ముఖ్య మని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు.

సేవా, సహకారంతో ముందుకు సాగుదాం
తల్లిని సన్మానించిన గోరటి వెంకన్న

ఎమ్మెల్సీ గోరటి వెంకన్న


తెలకపల్లి, నవంబరు 19: సాటి వారికి, సమాజాభి వృద్ధికి తమవంతు సేవా, సహకారంతో ముందుకు సా గాలని ప్రతి వ్యక్తికి మమకారం, ఆత్మీయతలే ముఖ్య మని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. గవర్నర్‌ కోటా లో ఎమ్మెల్సీగా ఎంపికై ప్రమాణ స్వీకారం అనంతరం గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండల పరిధిలోని గౌరారం తన సొంత గ్రామానికి చేరుకొని తండ్రి సమాధి వద్ద పూజ నిర్వహించారు. తల్లిని సన్మానించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో తన ఆత్మీయతను చాటు కున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమా నులు ఇచ్చిన ప్రొద్బలంతో ముందుకు సాగుతున్నానని, తెలంగాణ ప్రభుత్వం తనకు మరింత సేవ, సహకారం అందించేందుకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిందని దాంతో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయనున్నట్లు వారు తెలిపారు. గోరటి వెంకన్న వచ్చారన్న విషయం తెలుసుకున్న సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ మామి ళ్లపల్లి యాదయ్య, నాయకులు చక్రవర్తి, చోటేమియాలు గౌరారం గ్రామానికి చే రుకొని ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, మిత్రులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-20T03:48:04+05:30 IST