స్వీయ రక్షణకు కరాటే అవసరం
ABN , First Publish Date - 2020-12-16T03:10:56+05:30 IST
ప్రస్తుత సమాజంలో స్వీయ రక్షణ కోసం కరాటే విద్య బాలబాలికలకు అవసరమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావుల రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావుల రవీంద్రనాథ్‌రెడ్డి
కొత్తకోట, డిసెంబరు 15: ప్రస్తుత సమాజంలో స్వీయ రక్షణ కోసం కరాటే విద్య బాలబాలికలకు అవసరమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావుల రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. టైగర్ బ్రూస్‌లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మంగళ వారం పట్టణంలో కరాటే కిక్ బాక్సింగ్ విద్యార్థులకు గ్రేడింగ్ పరీక్షలు నిర్వహిం చారు. బేసిక్స్, కిక్స్, కటాస్, కుమితే, వెపన్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 30 మంది విద్యార్థులకు రవీంద్రనాథ్‌రెడ్డి సర్టిఫికేట్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుంత మౌనిక, భరత్‌భూషణ్, ఖాజామైనోద్దీన్, అకాడమీ అధ్యక్షులు శివ యాదవ్, కరాటే మాస్టర్లు శ్రీకాంత్ యాదవ్, శివకృష్ణ పాల్గొన్నారు.