-
-
Home » Telangana » Mahbubnagar » Selection of Mahambubnagar under Atmanirbhar
-
ఆత్మనిర్భర్ కింద మహబూబ్‌నగర్ ఎంపిక
ABN , First Publish Date - 2020-12-31T03:13:59+05:30 IST
ప్రధాన మంత్రి వీధివ్యాపారుల ఆత్మనిర్భర్ పథకం కింద మహబూబ్‌నగర్ మునిసిపాలటీ ఎంపికైనట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్‌కుమార్ మిశ్రా తెలిపారు.

కలెక్టరేట్ (మహబూబ్‌నగర్), డిసెంబరు 30: ప్రధాన మంత్రి వీధివ్యాపారుల ఆత్మనిర్భర్ పథకం కింద మహబూబ్‌నగర్ మునిసిపాలటీ ఎంపికైనట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్‌కుమార్ మిశ్రా తెలిపారు. ఈ పథకంపై బుధవారం ఆయన ఢిల్లీ నుంచి మహబూబ్‌నగర్ కలెక్టర్, ఇతర అధికా రులలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ ఈ పథకానికి మహబూబ్‌నగర్ ఎంపికవడం సంతోషకరమని అన్నారు. కాన్ఫరెన్స్‌లో కమిషనర్ సత్యనారాయణ, మెప్మా పీడీ శంకరాచారి పాల్గొన్నారు.
భూసేకరణ సమస్యలు పరిష్కరించాలి
ఎత్తిపోతల పథకాలు, జాతీయ రహదారి, రైల్వే తదితర ప్రాజెక్టులకు సంబంధించి సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. భూసేకరణ అంశంపై బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్‌వో కె.స్వర్ణలత, ఆర్డీవో జే.శ్రీనివాస్, ఏడీ శ్యాంసుందర్, ఈడీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
జనవరి 1 నుంచి ఫాస్టాగ్ అమలు
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జనవరి 1 నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. ఫాస్టాగ్ మినహాయింపు పొందే ప్రభుత్వ శాఖల వాహనాలపై జాతీయ రహదారుల అథారిటీకి ప్రతిపాదనలు పంపాలన్నారు.