-
-
Home » Telangana » Mahbubnagar » second day
-
రెండో రోజు భక్తుల తాకిడి
ABN , First Publish Date - 2020-11-22T03:32:09+05:30 IST
తుంగభద్ర పుష్కరాల్లో భా గంగా రెండు రోజు శనివారం పుల్లూరు ఘాట్‌కు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.

ఉండవల్లి, నవంబరు 21: తుంగభద్ర పుష్కరాల్లో భా గంగా రెండు రోజు శనివారం పుల్లూరు ఘాట్‌కు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ, అ మలాపురం, రాజమహేంద్రవరం నుంచి భక్తులు వ చ్చి, స్నానాలు చేశారు. 100 మందికిపైగా పిండ ప్రదానా లు చేశారు. భక్తులు పెరిగే అవకాశం ఉండడంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నామని సర్పంచు నారాయణమ్మ తెలిపారు. భక్తులకు, సిబ్బందికి అన్నదానం చేశారు.
ఏర్పాట్లు భేష్: స్టీఫెన్ రవీంద్ర, ఐజీ
పుల్లూరు పుష్కర ఘాటు దగ్గర ఏర్పాటు చేసిన సౌకర్యాలపై పోలీసు ఐజీ స్టీఫెన్ రవీంద్ర సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచును అభినందించారు.