ప్రజల వద్దనే పరిష్కారం.. ఎస్సీ, ఎస్టీ కేసులు 30 రోజుల్లో పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-12-11T03:28:00+05:30 IST

ప్రజల వద్దకు వచ్చి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు.

ప్రజల వద్దనే పరిష్కారం.. ఎస్సీ, ఎస్టీ కేసులు 30 రోజుల్లో పరిష్కరించాలి
సమావేశంలో మాటట్లాడుతున్న ఎస్సీ. ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ళ శ్రీనివాస్‌

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌

కలెక్టరేట్‌/ పాలమూరు, డిసెంబరు 10: ప్రజల వద్దకు వచ్చి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు. గురువారం ఉమ్మడి జిల్లా కల్టెక్టర్లు, ఎస్పీలతో రెవెన్యూ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సత్వర న్యాయం చేసేందుకు జిల్లాలకే వచ్చి ప్రజల మధ్య జన అదాలత్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఎస్సీలపై దాడులు జరగకముందే వారికి అవగాహన కల్పించాలని, 30 రోజుల్లో అట్రాసిటీ కేసులను పరిష్కరించాలన్నారు. కలెక్టర్లు తమత మత పరిధిలో ఉన్న కేసులను పరిష్కరిస్తే తమ వద్దకే వచ్చే కేసులు తగ్గుతాయన్నారు. చట్టానికి లోబడి అందరూ పని చేయాలని, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని చెప్పారు. కులం అన్నింటికన్నా ప్రమాదమైనదని, ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కళా బృందాల ద్వారా ప్రజల్లో అంటరానితనం, అస్పృశ్యతపై అవగాహన కల్పించి వాటిని నివారించే ప్రయత్నం చేయాలని కోరారు. ట్రైకార్‌ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు చేయూతనివ్వాలని అన్నారు. మూడు నెలలకోసారి జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ సమావేశాలు నిర్వహించాలని వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్లు వెంకట్రావ్‌, యాష్మిన్‌బాష, ఎల్‌.శర్మన్‌, శ్రుతిఓఝా, హరిచందన, కమిషన్‌ సభ్యులు బి.విద్యాసాగర్‌, ఎం.రామ్‌బాల్‌ నాయక్‌, నీలాదేవి, చిలకమర్రి నరసింహ, ఎస్పీలు రెమారాజేశ్వరి, చేతన, రజత్‌సింగ్‌, సాయిశేఖర్‌, అడిషినల్‌ కలెక్టర్లు తేజస్‌ నందలాల్‌ పవార్‌, సీతారామారావు పాల్గొన్నారు. 

దళితుల భూములకు రక్షణ లేదు


ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో దళితుల భూములకు రక్షణ లేదని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాయికంటి రాందాసు అధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డా.ఎర్రోల్ల శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. గురువారం జిల్లా కేం ద్రంలోని జడ్పీ ఆవరణలో చైర్మన్‌ను కలిసిన పలువు రు దళిత సంఘాల నాయకులు మాట్లాడారు. దళితు ల భూములను అన్యాక్రాంతంపై అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టా, పాసుబుక్కులు ఇప్పించడంలో నిర్లక్ష్యం ఉందన్నారు. నాగర్‌కర్నూల్‌ దళిత మహిళ ఇల్లు విషయం డీఎస్పీ దృష్టికి తీసుకుపోయినా ఫలి తం లేకపోయిందన్నారు. నారాయణపేట జిల్లా మక్త ల్‌ మండలం పారేవులలో చింతచెట్టు అనుమంతు కల్లు దుకాణం దగ్గర జరిగిన సంఘటనపై పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. వనపర్తి జిల్లా పెద్ద మందడి, మద్దిగట్లలో భూమి విషయమై దళితుడిపై దాడి చేసినా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కొనగట్టుపల్లి, నవాబ్‌పేట మండలం లోకిరేవులో మైనార్టీకి చెందిన వ్యక్తి కబ్జా చేశాడని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కేంద్రంలో కొమ్ముగేరిలో 250 గజాల స్థలాన్ని కబ్జా చేయడానికి కుట్ర జరుగుతోందన్నారు. కబ్జాల విషయంలో రెవెన్యూ అధికారులు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. చైర్మన్‌ను కలిసిన వారిలో సింగిరెడ్డి పరమేశ్వర్‌, ఎం.రాము, ఎస్‌.బాలరాజు, గోపి, గంగారం, భీమరాజు, పి.ఆంజనేయులు, శ్యామ్‌, విజయలక్ష్మి, వేణు, జగన్‌, రాజు, ఈశ్వర్‌, గణేష్‌, సురేష్‌, ఈశ్వరయ్య, సి.హనుమంతు, మున్నయ్య, చిన్న వెంకటయ్య పాల్గొన్నారు. 

ఎస్సీ ఎస్టీ చైర్మన్‌ కలిసిన కో ఆప్షన్‌ సభ్యుడు


హన్వాడ: జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను మండల కోఆప్షన్‌ సభ్యుడు మన్నన్‌ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలను ఆయనకు వివరించినట్లు మన్నన్‌ తెలిపారు.Updated Date - 2020-12-11T03:28:00+05:30 IST