-
-
Home » Telangana » Mahbubnagar » SAVE ELECTRICITY
-
కరెంటు ఆదా చేయాల్సిందే
ABN , First Publish Date - 2020-03-23T07:43:47+05:30 IST
నారాయణపేట మునిసిపాలిటీలో వి ద్యుత్ వినియోగం తగ్గించేందుకు చర్య లు చేపట్టారు. ఇటీవల కలెక్టర్ హరి చందన మునిసిపాలిటీలలో విద్యుత్ బిల్లులు...

- మునిసిపాలిటీలో ఎల్‌ఈడీ బల్బుల వినియోగం
- విద్యుత్ స్తంభాలు, పవర్ బోర్లకు కొత్త మీటర్లు
- రూ.28 లక్షల నుంచి రూ.15 లక్షలకు తగ్గిన బిల్లులు
- పోల్ టు పోల్ సర్వే చేస్తున్న మునిసిపల్ సిబ్బంది
- పట్టణంలో 2,991 ఎల్‌ఈడీ వీధి దీపాలు, 53 పవర్ బోర్లు
నారాయణపేట, మార్చి 22: నారాయణపేట మునిసిపాలిటీలో వి ద్యుత్ వినియోగం తగ్గించేందుకు చర్య లు చేపట్టారు. ఇటీవల కలెక్టర్ హరి చందన మునిసిపాలిటీలలో విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. ప్రతినెల రూ.28 లక్షల వరకు పవర్ బోర్లు, వీధిదీపాల కు సంబంధించిన విద్యుత్ బిల్లులు వచ్చేవి. కమిషనర్ శ్రీనివాసన్ విద్యుత్ సిబ్బందితో కలిసి సర్వే చేశారు. పాత విద్యుత్ మీటర్ల స్థానంలో కొత్త మీటర్లు బిగించేలా చర్యలు తీసుకున్నారు. ప్రత్యే కంగా వీధి దీపాల లైన్లతో పాటు కొత్త మీటర్ల బిగింపువల్ల జనవరి నెలలో విద్యుత్ బిల్లు రూ.13,56,140 వచ్చింది. ఇందులో వీధి దీపాలకు సంబంధించి 129 మీటర్లకు గాను రూ.9,12,678, 53 పవర్ బోర్ మోటార్లకు సంబంధించి రూ.4,43,462 బిల్లు వచ్చింది. దాదాపు నెలకు రూ.8 లక్షల వరకు మునిసిపా లిటీకి నెలసరి విద్యుత్ బిల్లులో ఆదా అవుతున్నది.
వీధి దీపాలు 18 ఓల్టుల నుంచి 110 ఓల్టుల ఎల్‌ఈడీ బల్బులు మొత్తం 2,991 పట్టణంలో ఉన్నాయి. అయితే పట్టణ ప్రగతిలో ఇంకా 1000 ఎల్ ఈడీ బల్బులు అవసరమని వివిధ వార్డుల నుంచి ప్రజలు, ప్రజాప్రతిని ధులు కోరడంతో అందు కనుగుణంగా ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ముఖ్యమైన ప్రధాన కూడళ్లతో పాటు రహాదారుల్లో అవసరాన్ని బట్టి వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవ డంతో పాటు విద్యుత్ ఆదాకు అవలం భించాల్సిన అంశాలపై పోల్ టూ పోల్ సర్వేకు మునిసిపల్ సిబ్బంది తాజాగా శ్రీకారం చుట్టింది. 53 బోర్లకు సంబం ధించి కూడా వినియోగంపై ఏ మేరకు ఆంక్షలు విధించాలి, మిషన్ భగీరథ నీటి లభ్యత తదితర అంశాలపై కూడా ఆరా తీస్తున్నారు. లో ఓల్టేజి ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు తదితర అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటు న్నారు. కలెక్టర్ ఆదేశాలతో మునిసిపల్ అధికార యంత్రాంగం విద్యుత్ వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టిని సారిస్తుంది. ఏ మేరకు అధికార యంత్రాంగం చర్యలకు పాలకులు సహాకరించి పూర్తి స్థాయిలో విద్యుత్ ఆదాకు తమ వంతు చేయూతను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.