నిత్యావసర సరుకుల పంపిణీ

ABN , First Publish Date - 2020-12-16T04:18:54+05:30 IST

భారీ వర్షాలతో ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మంగళవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

నిత్యావసర సరుకుల పంపిణీ
బాధితులకు దుస్తులు పంపిణీ చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం) డిసెంబరు 15: భారీ వర్షాలతో ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మంగళవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జిల్లా రెడ్‌క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు పట్టణం లో దాదాపు వంద ఇళ్లు దెబ్బతిన్నాయని, వారికి రెడ్‌క్రాస్‌ సంస్థ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ లయన్‌ నటరాజ్‌ సభ్యులు డా. శ్యామ్యూల్‌, వ్యవ సాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాల్గొన్నారు.


క్రిస్మస్‌ పండగను వైభవంగా జరుపుకోవాలి

మహబూబ్‌నగర్‌: క్రిస్మస్‌ పండగను వైభవంగా జరుపుకోవాలని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎంబీసీ చర్చి ఆవరణ లో నిరుపేద క్రిష్టియన్లకు దుస్తులు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పాలమూరులో ప్రతిఏటా క్రిస్మస్‌ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటా రని, ఈ ఏడాది కూడా శాంతియుత వాతావరణం లో పండగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.  కార్యక్రమంలో అడిషినల్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటి గణేష్‌, క్రిష్టియన్‌ నాయకులు స్వదేశి, డేవిడ్‌, ప్రభాకర్‌, రాణి, వరలక్ష్మి పాల్గొన్నారు.


మంత్రికి సన్మానం

పాలమూరు: మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ను మంగ ళవారం జిల్లా కేంద్రంలో గజమాలతో సన్మానించా రు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మాదిగల అభివృ ద్ధికి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్న మంత్రిని గుండెల్లో పెట్టుకునే బాధ్యత మాదిగలపై ఉందని టీఎమ్మార్పీఎస్‌-టీఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి మెల్లె పోగు శ్రీనివాస్‌ అన్నారు. కార్యక్రమంలో వెంకట య్య, బాలయ్య, ఉదయ్‌, యాదగిరిలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-16T04:18:54+05:30 IST