వచ్చేనెల 1 నుంచి పారిశుధ్య వారోత్సవాలు

ABN , First Publish Date - 2020-05-29T11:01:32+05:30 IST

జిల్లాలో కొనసాగుతున్న అభి వృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వచ్చేనెల 1వ తేదీ నుంచి అన్ని

వచ్చేనెల 1 నుంచి పారిశుధ్య వారోత్సవాలు

ప్రత్యేక అధికారులదే బాధ్యత

ఈ ఏడాది 62 లక్షల మొక్కలు టార్గెట్‌

సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ వెంకట్రావు


మహబూబ్‌నగర్‌, మే 28 : జిల్లాలో కొనసాగుతున్న అభి వృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వచ్చేనెల 1వ తేదీ నుంచి అన్ని గ్రామాల్లో పారిశుధ్య వారోత్సవాలు నిర్వహించా లని కలెక్టర్‌ వెంకట్రావు అధికారులకు సూచించారు. వారం రో జుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో ప్రత్యేక అధి కారులు కీలకపాత్ర పోషించాలన్నారు. గురువారం కలెక్టరేట్‌ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియంత్రిత వ్యవసాయ విధానం, 2020లో సాగు చేయాల్సిన పంటల ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ప్రత్యేక అధికారు లు వారివారి మండలాల్లో తిరిగి డిమాండ్‌ ఉన్న పంటల గు రించి రైతులకు వివరించాలన్నారు. వరి, కంది, పెసర విత్తనా లు సిద్ధంగా ఉన్నాయన్నారు.


విత్తనాల విషయంలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రతి సీనియర్‌ అధికారికి ఐదు రైతు వేదికలను నిర్మించే బాధ్యతలను అప్పగించాలన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిరాడం బరంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది హరితహా రం కింద 62 లక్షల మొక్కలు నాటాలని సూచించారు. వచ్చే నెల 8 నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు ఏర్పా ట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సీతారామారావు, మోహన్‌లాల్‌, డీఆర్వో స్వర్ణలత, జ డ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.


ఆధార్‌ అనుసంధానం చేయించుకోవాలి

కలెక్టరేట్‌ (మహబూబ్‌నగర్‌) : రైతులంతా బ్యాంకుల్లోని తమ రుణాల ఖాతాలకు ఆధార్‌ నెంబర్లను అనుసంధానం చే యించుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు సూచించారు. రెవె న్యూ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వ్యవసాయాధి కారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదార్‌ అ నుసంధానం కోసం వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఏఈఓల తో బృందాలు ఏర్పాటు చేసి ఉత్తర్వులు ఇవ్వాలని, వీరు రైతు లను కలిసి ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను చేపట్టాలని సూ చించారు. అన్ని చోట్ల విత్తనాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయాధికారి హుక్యానాయ క్‌, వివిధ మండలాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-29T11:01:32+05:30 IST