ఏడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ABN , First Publish Date - 2020-12-16T04:06:46+05:30 IST
ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకును తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు.
మక్తల్‌రూరల్, డిసెంబర్ 15 : ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకును తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. సోమవారం రాత్రి 12గంటల సమ యంలో పెద్దవాగునుంచి గుర్లపల్లి మీదుగా మక్తల్‌కు ఇసుక ను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను, చిట్యాల వాగు నుంచి ఇ సుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను కర్ని శివారులో మం గళవారం ఉదయం పట్టుకొని మక్తల్ పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. ఈ మేరకు ఎస్సై ఏ.రాములు ట్రాక్టర్ల యజమానుల పై కేసు నమోదు చేశారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
సర్పంచ్‌పై ఇసుక మాఫియా జులుం
మూసాపేట: మండల పరిధిలోని జానం పేట సర్పంచ్ శ్రీనివాసులుపై మంగళవారం ఇసుకమాఫియా జులుం ప్రదర్శించింది. దాంతో గ్రామస్థులు, ఇసుక మాఫి యా కొట్టుకునేస్థాయికి పోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ తాళ్లగడ్డవాగు నుంచి ఎప్పుడుపడితే అ ప్పుడు ఇసుకను తరలిస్తున్నారన్నారు. ఇసుకను తరలిస్తున్న ట్రా క్టర్లపై కేసులు నమోదు చేయాలని సర్పంచ్ డిమాండ్ చే శా రు. దాంతో పోలీసులు నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నారు.