సరళాసాగర్‌లో ఇసుక తోడేళ్లు

ABN , First Publish Date - 2020-05-30T09:58:22+05:30 IST

సరళాసాగర్‌ ప్రాజెక్టులో తోడేళ్లు మకాం వేశాయి.. ఇక్కడి ఇసుక సంపదను యథేచ్ఛగా

సరళాసాగర్‌లో ఇసుక తోడేళ్లు

విలువైన ఇసుకపై కన్నేసిన మాఫియా 

కరకట్ట నిర్మాణం పేరుతో ఇసుక తోడివేత

అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో దందా 

రాత్రి వేళల్లో హైదరాబాద్‌కు రవాణా

వానాకాలం సాగు దగ్గర పడుతున్న పూర్తి కాని పనులు 

ఇసుక తరలింపుపైనే దృష్టి పెట్టిన గుత్తేదారు

పట్టించుకోని మైనింగ్‌, రెవెన్యూ శాఖలు


మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి: సరళాసాగర్‌ ప్రాజెక్టులో తోడేళ్లు మకాం వేశాయి.. ఇక్కడి ఇసుక సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతున్నాయి.. ఆరు నెలల కిందట ప్రాజెక్టు కరకట్ట తేగిపోగా, వాటి మరమ్మతు పనులను కాంట్రాక్టర్‌ ముసుగులో దక్కించుకున్నాయి.. రోజూ ఎక్స్‌కవేటర్ల సహాయంతో ఇసుకను తోడుతున్నాయి.. ప్రాజెక్టు సమీపంలో డంపులు చేసి, రాత్రిళ్లు టిప్పర్లలో హైదరాబాద్‌కు తరలించి క్యాష్‌ చేసుకుంటున్నాయి.. వానాకాలం సాగుకు దగ్గర పడుతుండగా తెగిన కట్టను ఎంత వేగంగా పూర్తి చేసి మళ్లీ పొలాలకు సాగునీరిస్తారనే రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి.. కట్ట నిర్మాణానికి వేయి మెట్రిక్‌ టన్నుల ఇసుక అనుమతుల పేరుతో స్థానిక నాయకులు ఇసుక దందా ఒక వైపు సాగుతుంటే, టీఎస్‌ఎండీసీ ఈ ప్రాజెక్టులో 1.80 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక ఉందని, దాన్ని తవ్వేందుకు టెండర్లు ఆహ్వానించింది.. ఈ టెండర్లు ఖరారు కాక ముందే ఇష్టారీతిన ఇసుకను తవ్వి సొమ్ము చేసుకుంటున్న వైనం నెలకొన్నది.. టెండర్లే ఖరారు కాకపోయినా ప్రాజెక్టులో నామమాత్రపు అనుమతుల పేరుతో భారీగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపైనా విమర్శలొస్తున్నాయి..


రైతులకు సాగునీరిచ్చే ప్రాజెక్టు కట్ట మరమ్మతు పనుల అ నుమతుల పేరుతో, ఆ ప్రాజెక్టు నుంచే  ఇసుకను తోడి బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు కొందరు అక్రమార్కులు. గో రంత అనుమతులు తీసుకొని కొండంత ఇసుకను తవ్వుతున్నా రు. ఆరు నెలల కిందట కరకట్ట తెగిపోయిన సరళాసాగర్‌ కేం ద్రంగా సాగుతున్న ఈ అక్రమ ఇసుక దందాను, అధికార పా ర్టీకి నాయకులే నడుపుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో ఉన్న సరళాసాగ ర్‌ ప్రాజెక్టు చారిత్రాత్మకమైనది. ఊకచెట్టు వాగుపై సైఫన్‌ పద్ధ తిలో ఈ ప్రాజెక్టును నిజాం హయాంలో అప్పటి వనపర్తి సం స్థానాధీశులు నిర్మించారు. 2019 డిసెంబర్‌ 31న నీళ్లు నిండుగా ఉండడం, కరకట్ట బలహీనంగా ఉండటంతో కట్ట తెగిపోయిం ది. దీంతో నీరంతా దిగువకు వెళ్లిపోయి, ప్రాజెక్టు ఎడమ భా గం పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో ఖరీఫ్‌ పంటలకు సాగునీరు అందలేదు. కట్ట తెగిపోయినప్పుడు ప్రాజెక్టును సందర్శించిన మంత్రి, ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు తక్షణం మరమ్మతులు చే యిస్తామని, రీడిజైన్‌తో అద్భుతంగా పునరుద్ధరిస్తామని చెప్పా రు. ఆ మేరకు అధికారులు కరకట్ట పునర్నిర్మాణ పనుల బా ధ్యతలను వనపర్తి జిల్లాకే చెందిన ఒక కాంట్రాక్టర్‌కు అప్పగిం చారు. ఈయన అధికార పార్టీ నాయకుడు. ప్రాజెక్టు పునర్నిర్మా ణానికి వెయ్యి మెట్రిక్‌ టన్నుల ఇసుక అవసరమవుతుందని అంచనా వేసిన అధికారులు, ఆ మేరకు ఈ ప్రాజెక్టులోనే ఇసు కను తవ్వుకునేందుకు అనుమతిచ్చారు.


వానాకాలం సీజన్‌ స మీపిస్తున్న తరుణంలో వేగంగా పనులు పూర్తి చేసి, ప్రాజెక్టు ను అందుబాటులోకి తీసుకురావాల్సిన కాంట్రాక్టర్‌ పనులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రాజెక్టులో నిల్వ ఉన్న ఇసుకను త రలించడంపై దృష్టి పెట్టాడు. ఎక్స్‌కవేటర్లతో రాత్రిళ్లు ఇసుకను తోడుతున్నాడు. టిప్పర్ల ద్వారా సమీపంలోని డంపులకు తర లించి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లి అమ్ముకుం టున్నాడు. కట్ట నిర్మాణ అనుమతుల పేరుతో ఒక వైపు ఇసుక దందా సాగుతుంటే, టీఎస్‌ఎండీసీ ఈ ప్రాజెక్టులో 1.80 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక ఉందని, రవాణాకు టెండర్లను ఆహ్వా నించింది. ఈ టెండర్లు ఖరారు కాకుండానే ఇసుక తరలిపో తుంటే మైనింగ్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు పట్టించుకో కపోవడంపై విమర్శలు వస్తున్నాయి.


ఇప్పటికే ఇసుక అక్రమంగా తరలిపోతుండటంతో టీఎస్‌ఎం డీసీ వేసిన టెండర్లకు స్పందన కూడా రావడం లేదు. అక్ర మంగా ఇసుక రవాణా చేస్తున్న వారు వేరే వారిని టెండర్లు వేయకుండా నియంత్రిస్తున్నారనే విమర్శలూ వస్తున్నాయి. ఇకనైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకో వాల్సిన అవసరం ఉన్నది.

Updated Date - 2020-05-30T09:58:22+05:30 IST