ఎర్రవల్లిలో ఎర్రమట్టి దందా!

ABN , First Publish Date - 2020-12-27T04:17:10+05:30 IST

కొత్తగా వెలుస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు మట్టి మాఫియాకు కాసులు కురిపిస్తున్నాయి.

ఎర్రవల్లిలో ఎర్రమట్టి దందా!
తిమ్మాపూర్‌ శివారులోని గుట్ట నుంచి ఎర్రమట్టిని టిప్పర్లలో నింపుతున్న దృశ్యం

- మట్టి మాఫియా అవతారమెత్తిన కొందరు అధికార పార్టీ నాయకులు 

- రియల్‌ వెంచర్ల యజమానులతో మట్టి తరలింపునకు ఒప్పందాలు


గద్వాల, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : కొత్తగా వెలుస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు మట్టి మాఫియాకు కాసులు కురిపిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుంగా యథేచ్ఛగా గుట్టల నుంచి మట్టిని తోడుతున్నాయి. ఇందులో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు సూత్రఽ దారులుగా ఉండటంతో విశేషం.


తిమ్మాపూర్‌ గుట్టల నుంచి మట్టి తరలింపు..

జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం తిమ్మాపూర్‌ గ్రామా శివారులో రెండు చిన్న గుట్టలు ఉన్నాయి. ఇదే మండలం ఎర్రవల్లి చౌరాస్తాలో దాదాపు పదికి పైగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వెలిశాయి. ఈ వెంచర్లకు కావాల్సిన ఎర్రమట్టిని తాము అందిస్తామని ఇదే మండ లంలోని అధికార పార్టీకి చెందిన మహిళా ప్రజాప్రతినిధుల భర్తలు రంగంలోకి దిగారు. ఎవ రూ ఎలాంటి అనుతమలు తీసుకోకుండా ఈ రెండు కొండల నుంచి ఎర్రమట్టిని తవ్వుతున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాంల అండ మాకుందని, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల యజమానులతో మట్టి తరలింపునకు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. 15 రోజులుగా పది టిప్పర్లు, మూడు ఎక్స్‌కవేటర్లతో రాత్రి, పగలు తేడా లేకుండా ఎర్రమట్టిని వెంచర్లకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ.3 కోట్లు విలువ చేసే మట్టిని తరలిం చినట్లు సమాచారం. అయితే, ఇంత మట్టిని మా ఊరు నుంచి తీసుకెళ్తున్నారు? మాకు ఏమి  లేదా? అని కొందరు చోటా మోటా నాయకులు అడ్డు తిరుగుతున్నారు. దీంతో దందాను నిర్వ హించే ముగ్గురు వ్యక్తులు తలా రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.6 లక్షలను వీరికి అం దజేశారు. అలాగే గ్రామ సర్పంచ్‌, కార్యదర్శికి ప్రత్యేక ప్యాకేజీ అందించినట్లు తెలిసింది. 

ఎర్రవల్లి చౌరస్తాలోని విజయ అయిల్‌ మిల్లులో కూడా ఎర్రమట్టి నిల్వలు ఉన్నాయి. వారం రోజులుగా ఈ మిల్లు నుంచి దాదాపు 20 ట్రాక్టర్ల ఎర్రమట్టిని రియల్‌ వెంచర్లకు తరలిస్తున్నా రు. ఈ మట్టిని మిల్లుకు చెందిన కొందరు పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు జరుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ పని చేసే సిబ్బంది మాత్రం కొంత మట్టిని మాకు ఇ స్తామంటే, మిగిలిన మట్టిని వారు తీసుకు వెళ్లడానికి అనుమతి ఇచ్చామని చెబుతున్నారు. ఇ లా ఎర్రవల్లి చౌరస్తాలో ఎర్రమట్టి దందా యథేచ్ఛగా సాగుతున్న రెవెన్యూ, పోలీస్‌, గనులు భూగర్భ శాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు.

Updated Date - 2020-12-27T04:17:10+05:30 IST