సమ్మెను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2020-11-26T04:42:49+05:30 IST

దేశవ్యాప్తంగా గురువారం చేపట్టిన సార్వత్రిక సమ్మెను కార్మికవర్గం జయప్రదం చే యాలని సెంట్రల్‌ ట్రేడ్‌యూనియన్లు, సీఐటీయూ, ఏఐటీ యూసీ, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ, టీఆర్‌ఎస్‌కేవీ, టీఎన్‌ టీయూసీ, హెచ్‌ఎంఎస్‌ల నాయకులు ఎన్‌.కురుమూర్తి, యం.రాంమ్మోహన్‌, సి.వెంకటేష్‌ బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

సమ్మెను జయప్రదం చేయండి

 ఆల్‌ట్రేడ్‌యూనియన్స్‌ జేఏసీ 

పాలమూరు/మహబూబ్‌నగర్‌ క్లాక్‌టవర్‌/విద్యావిభాగం/  చిన్నచింతకుంట, నవంబరు 25: దేశవ్యాప్తంగా  గురువారం చేపట్టిన సార్వత్రిక సమ్మెను కార్మికవర్గం జయప్రదం చే యాలని సెంట్రల్‌ ట్రేడ్‌యూనియన్లు, సీఐటీయూ, ఏఐటీ యూసీ, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ, టీఆర్‌ఎస్‌కేవీ, టీఎన్‌ టీయూసీ, హెచ్‌ఎంఎస్‌ల నాయకులు ఎన్‌.కురుమూర్తి, యం.రాంమ్మోహన్‌, సి.వెంకటేష్‌ బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. కేంద్ర ఉద్యోగుల సంఘాల ఫెడరేషన్లు, బ్యాంకు ఉద్యోగులు, జీవితబీమా సంస్థ ఎల్‌ఐసీ, బ్యాంకు, ఆటోరంగం, పోస్టల్‌, రైల్వే, మెడికల్‌అండ్‌హెల్త్‌, ఔట్‌ సోర్సిం గ్‌ కార్మికులు, మునిసిపల్‌, గ్రామ పంచాయతీ, భవన నిర్మా ణ కార్మికులు, హమాలీలు, ఇతర అసంఘటిత రంగాల్లో పని చేసే కార్మికులు సమ్మెలో పాల్గొనాలని కోరారు. 

- సార్వత్రిక సమ్మెకు తెలంగాణ ప్రజాఫ్రంట్‌ మద్దతు ఇస్తు న్నట్లు జిల్లా సమన్వయకర్త పి.బుచ్చారెడ్డి ఒక ప్రకటనలో తె లిపారు.  టీఎన్‌జీవోస్‌ ఉద్యోగులు మధ్యాహ్నం భోజన విరా మ సమయంలో నిరసన వ్యక్తం చేయాలని జిల్లా అధ్యక్ష, కా ర్యదర్శులు జి.రాజీవ్‌రెడ్డి, ఆర్‌.చంద్రానాయక్‌ ఉద్యోగులకు పి లుపునిచ్చారు.ఉపాధ్యాయ సంఘాలు కూడా సమ్మెకు మ ద్దతు తెలుపుతున్నట్లు ఉపాధ్యాయసంఘల పోరాట సమితి నాయకులు ఎన్‌ .కిష్టయ్య , శ్రీశైలం  తెలిపారు. 

- సమ్మెకు సీపీఎం, సీపీఐ న్యూడెమోక్రసీ పార్టీలు సం పూర్ణ మద్దతిస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.  

 బాదేపల్లి : ఆటోలకు ప్రభుత్వమే బీమా చేయించాలని ఆటో యూనియన్‌ అసోసియేషన్‌ నియో జ కవర్గ అధ్యక్షుడు షేక్‌హాజీ బుధవారం ఒక ప్రకటనలో డి మాండ్‌ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఈనెల 25 అర్ధరాత్రి నుంచి 26 అర్ధరాత్రి వరకు దేశవ్యాప్త స మ్మెకు తాము మద్దతు ఇస్తూ ఆటోలను బంద్‌ చేస్తున్నట్లు తెలిపారు.  సమ్మెకు టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం ఆధ్వర్యంలో మద్దతు ఇస్తున్నట్లు జడ్చర్ల నియోజకవర్గం అధ్యక్షులు వెంకటేష్‌గౌడ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.  

 సీఐటీయూ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

  దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నేతాజీ చౌరస్తా నుంచి సిగ్నల్‌గడ్డ, కొత్తబస్టాండ్‌, నిమ్మబావిగడ్డ వరకు ర్యాలీ నిర్వ హించారు. కార్యక్రమంలో నాయకులు జగన్‌, పరశురాం, నా గరాజు, మున్న, జబ్బర్‌, ఆరీఫ్‌, జంగయ్య, నాగరాజు, బాల కృష్ణ, రవి, ఈశ్వరయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-26T04:42:49+05:30 IST