సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ABN , First Publish Date - 2020-12-04T03:32:26+05:30 IST
ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు.

- ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
అచ్చంపేట, డిసెంబరు 3: ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. గురువారం మండల పరిధిలోని చంద్రసాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు పోతున్నామన్నారు. కేఎల్ఐ ద్వారా చంద్రసాగర్‌కు నీటిని అందించి రిజర్వాయర్‌గా మార్చనున్నట్లు పేర్కొన్నారు. అమ్రాబాద్, పదర మండలాలకు లిఫ్ట్ ద్వారా సాగునీరు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చంద్రసాగర్ పరిధిలోని 1000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ముందుగా ఆయకట్టు వద్ద పూజలు నిర్వహించి కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మనోహర్, ఆర్డీవో పాండు, తహసీల్దార్ చంద్రశేఖర్, జడ్పీటీసీ మంత్రియానాయక్, మునిసిపల్ చైర్మన్ తులసీరాం, నాయకులు నర్సింహగౌడ్, రాజేశ్వర్ రెడ్డి, రాజేందర్, నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.
వారం రోజుల్లోనే కేఎల్ఐ సాగునీరు
ఉప్పునుంతల: యాసంగిలో సాగు చేస్తున్న రైతులకు వారం రోజులలోనే కేఎల్ఐ సాగు నీరు అచ్చంపేట నియోజకవర్గానికి వస్తుందని ప్రభుత్వం విప్ గువ్వల బాల్‌రాజు అన్నారు. బుధవారం మండంలోని మండల పరిషత్ కార్యాలయంలో వైస్ ఎంపీపీ వెంకటేష్ అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఎజెండా చదువుతుండగా జడ్పీటీసీ అనంతాప్రతాపరెడ్డి గతంలో, ఇప్పుడు సమావేశానికి రాని అధికారుల మెమో ఇచ్చారు. అదే విధంగా గత సమావేశానికి హాజరు కాని తహశీల్దార్ కృష్ణయ్య గత సమావేశానికి వచ్చిన్నట్లు రిజిష్టర్‌లో సంతకం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎంఈవో రామరావు, పద్మ, శంకర్, తహశీల్దార్ కృష్ణయ్య, సురేష్, సైదులు, సుదర్శన్గౌడ, సాయి కృష్ణ, తదితరులు ఉన్నారు.