పగిలిన మిషన్ భగీరథ పైప్‌లైన్
ABN , First Publish Date - 2020-12-30T03:26:24+05:30 IST
మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి వ్యాపార సముదాయంలోకి నీరు చేరడంతో భారీ నష్టం వాటిల్లింది.
దేవరకద్ర, డిసెంబరు 29: మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి వ్యాపార సముదాయంలోకి నీరు చేరడంతో భారీ నష్టం వాటిల్లింది. దేవరకద్ర పట్టణ కేంద్రంలోని ప్లైఓర్ పనులు చేపడుతుండగా ప్రమాదవశాత్తుతో మిషన్ భగీరథ పైపులు పగిలాయి. దీంతో మిషన్ భగీరథ నీరు పెద్ద ఎత్తున రోడ్డు పక్కన్న ఉన్న ఫర్టిలైజర్, కూరగాయలు, హోటల్ పండ్ల దుకాణాల్లోకి నీరు చేరింది. దీంతో దుకాణ యజమానులు త్రీవంగా నష్ట పోయారు. కోయిల్‌సాగర్ రోడ్డు, రాయిచూర్, మహబూబ్‌నగర్ రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.