పాలకుల నిర్లక్ష్యంతోనే ఆగిన అభివృద్ధి

ABN , First Publish Date - 2020-12-28T01:57:45+05:30 IST

పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే అలంపూర్‌లో అభి వృద్ధి ఆగిపోయిందని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుమ్మల రవికుమార్‌ అన్నారు.

పాలకుల నిర్లక్ష్యంతోనే ఆగిన అభివృద్ధి

అలంపూర్‌, డిసెంబరు 27: పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే అలంపూర్‌లో అభి వృద్ధి ఆగిపోయిందని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుమ్మల రవికుమార్‌ అన్నారు. వివేకా నంద యూత్‌ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన ‘మన ఊరు-మన వేల్పు’ చర్చావేదికలో వివిధ పార్టీ నాయకులు  పాల్గొన్నారు. వివేకానంద యూత్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ చర్చావేదికలో అలంపూర్‌ అభివృద్ధిపై కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, సీపీఎం నాయకులు పాల్గొని పలు అంశాలను చర్చించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు, కాంగ్రెస్‌ నాయకుడు రాజన్న,  మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ,  కౌన్సిలర్లు సుదర్శన్‌గౌడు, ఇంతియాజ్‌, డైరక్టర్‌ రమేష్‌, దేవదాసు, రఘు, సుబ్బన్న గౌడు, మాజీ సర్పంచ్‌ పిండి జయరాములు, ఉపాధ్యాయుడు రమేష్‌  తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-12-28T01:57:45+05:30 IST