ఆర్టీసీ కార్మికుల బలిదానాలు వృథా కావు

ABN , First Publish Date - 2020-10-07T05:54:55+05:30 IST

తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు గతేడాది చేపట్టిన సమ్మె వల్ల రాష్ట్ర స్థాయిలో 31 మంది ఉద్యోగులు

ఆర్టీసీ కార్మికుల బలిదానాలు వృథా కావు

మహబూబ్‌నగర్‌ టౌన్‌, అక్టోబరు 6: తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు గతేడాది చేపట్టిన సమ్మె వల్ల రాష్ట్ర స్థాయిలో 31 మంది ఉద్యోగులు చనిపోయారని, వారి త్యాగం వృథా కాదని ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రీజినల్‌ కార్యదర్శి వీరాంజనేయులు అన్నారు. సమ్మె చేపట్టి ఏడాది గడిచిన సందర్భంగా మంగళవారం మహబూబ్‌నగర్‌ డిపో వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమరులైన 31 మంది కార్మికులకు నివాళ్లర్పించారు.


ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ కార్మికుల సమ్మె ప్రారంభమైన రోజు 2019 అక్టోబరు 6ను కార్మికుల త్యాగాల దినంగా నిర్వహించాలని కార్మిక సంఘాలు  నిర్ణయించాయన్నారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 55 రోజుల పాటు సమైక్యంగా, వీరోచితంగా సమ్మె జరిగిందని అన్నారు. అమరులైన 31 మంది కార్మికుల్లో ఒకరు స్థానిక డిపోకు చెందిన డ్రైవర్‌ వీకే గౌడ్‌ ఉన్నార న్నారు. వారిత్యాగాల వల్ల ప్రభుత్వం దిగివచ్చిందని అన్నారు. సంస్థలో కార్మికుల సమస్యలు పెరిగాయని, వాటిని పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్‌, జిల్లా కార్యదర్శి కురుమూర్తి, ఎస్‌డ బ్ల్యూఎఫ్‌ డిపో అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, కృష్ణయ్య, నాయకులు పాల్గొన్నారు.

Read more