రైట్.. రైట్..
ABN , First Publish Date - 2020-05-19T10:34:39+05:30 IST
టీఎస్ ఆర్టీసీ సేవలు పునఃప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ లాక్‌డౌన్ అనంతరం మంగళవారం నుంచి పలు నిబంధనలతో ఆర్టీసీ బస్సులు

నేటి నుంచి రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 980 సర్వీసులు
చిన్న చిన్న మరమ్మతులతో బస్సులను సిద్ధం చేసిన అధికారులు
మహబూబ్‌నగర్, మే 18 : టీఎస్ ఆర్టీసీ సేవలు పునఃప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ లాక్‌డౌన్ అనంతరం మంగళవారం నుంచి పలు నిబంధనలతో ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. 50 శాతం సీటింగ్‌తోనే ప్రయాణికులను చేరవేయనున్నాయి. భౌతికదూరం పాటించేలా డబుల్ సీటులో ఒకరు, త్రిబుల్ సీటులో ఇద్దరు కూర్చోవాలని, ప్రయాణికులు కచ్చితంగా మాస్కులు ధరించాలి.
బస్సు ఎక్కే ప్రయాణికులందరికీ శానిటైజర్ చేసే ఏర్పాట్లను ఆర్టీసీ కల్పించనున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ బస్సు డీపోలు ఉండగా, ఈ డిపోల పరిధిలో మొత్తం 980 బస్సులు నడపనున్నట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ డిపోలో ఇప్పటికే కొన్ని బస్సులకు చిన్న చిన్న మరమ్మతులు చేసి సిద్ధం చేయగా, మహబూబ్‌నగర్-హైదరాబాద్‌కు వెళ్లే వారు ఆరాంఘర్ వరకే వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచే మహబూబ్‌నగర్‌కు బస్సులు నడుస్తాయి.