భారత్‌ బంద్‌ను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2020-12-07T04:27:09+05:30 IST

ఢిల్లీలో పది రోజులుగా వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం తో ఈనెల 8న భారత్‌ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చినందున జయప్రదం చేయాలని వామపక్ష, విపక్ష నాయకులు కోరారు.

భారత్‌ బంద్‌ను జయప్రదం చేయండి

- రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వామపక్ష, విపక్షాల పిలుపునారాయణపేట/ నారాయణపేట టౌన్‌/ నారాయణపేట రూరల్‌/ ధ న్వాడ/ఊట్కూర్‌, డిసెంబరు 6 :ఢిల్లీలో పది రోజులుగా వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం తో ఈనెల 8న భారత్‌ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చినందున జయప్రదం చేయాలని వామపక్ష, విపక్ష నాయకులు కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్‌), టీడీపీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వెంకట్రామ్‌రెడ్డి, బి.రాము, కొండన్న, గోపాల్‌ మాట్లాడారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని చలికి వణుకుతూ ఢిల్లీలో రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నా మోదీ సర్కార్‌ చర్చల పేరిట కాలయాపన చే స్తోందని విమర్శించారు. సమావేశంలో ఆయాపార్టీల, సంఘాల నాయకు లు కాశీనాథ్‌, నర్సింహులు, కాళేశ్వర్‌, అంజిలయ్య గౌడ్‌, వెంకట్‌ రాములు, అంజి, హన్మంతు, నరహరి పాల్గొన్నారు.

 రైతాంగ, వ్యవసాయ వినాశకర చట్టాలను రద్దు చేయాలని ఈనెల 8న ఇచ్చిన భారత్‌ బంద్‌కు సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ సంపూర్ణ మ ద్దతునిస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి.రాము ఆదివారం ఓ ప్రకటన లో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొనాలని కోరారు.


బందును విజయవంతం చేయాలి : టీఆర్‌ఎస్‌ 


కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 8న జరిగే భారత్‌ బంద్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు, నాయకులు, రైతు సమన్వయ సమితి సభ్యులు ప్రత్యక్షంగా పొల్గొని విజయవంతం చేయాలని రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు, టీఆర్‌ఎస్‌ మాజీ మండల అధ్యక్షుడు వేపూరి రాములు ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. 

ధన్వాడ మండలంలోని రైతులు విధిగా హాజరై బంద్‌ను విజయ వం తం చేయాలని రైతు సంఘం నాయకులు కందూర్‌ శ్రీనివాస్‌ రెడ్డి కోరారు. 

భారత్‌ బంద్‌లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఏఐకేఎంఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నప్ప కోరారు. ఆదివారం ఊట్కూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నాయ కులు వెంకట్‌రెడ్డి, కనకప్ప, లింగప్ప పాల్గొన్నారు.

Updated Date - 2020-12-07T04:27:09+05:30 IST