నవాబ్‌పేట రహదారికి నిధులు

ABN , First Publish Date - 2020-12-28T03:02:40+05:30 IST

నవాబ్‌పేట మండల కేంద్రానికి ఇటు జిల్లా కేంద్రానికి అనుసంధానంగా ఉన్న డబుల్‌ రోడ్డు రీబీటీ చేయించేందుకు నిధులు మంజూరయ్యాయి.

నవాబ్‌పేట రహదారికి నిధులు

నవాబ్‌పేట, డిసెంబరు 27: నవాబ్‌పేట మండల కేంద్రానికి ఇటు జిల్లా కేంద్రానికి అనుసంధానంగా ఉన్న డబుల్‌ రోడ్డు రీబీటీ చేయించేందుకు నిధులు మంజూరయ్యాయి. రోడ్డు సరిగా లేకపోవడంతో నవాబ్‌పేట నుంచి సుమారు ఐదు కిలో మీటర్లు కొంతకాలంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి మొత్తం 18 కిలో మీటర్లు ఉండగా ఇందులో మహబూబ్‌నగర్‌ నుంచి పత్తేపూర్‌ గేట్‌ వరకు 13 కిలో మీటర్ల రహదారిని తెలంగాణ ప్రభుత్వం రీబీటీ ద్వారా రోడ్డు వేయించింది. పత్తేపూర్‌ గేట్‌ నుంచి నవాబ్‌పేట వరకు మిగిలి ఉన్న డబుల్‌ రహదారి కొంత కాలంగా మరమ్మతుకు నోచుకోకపోవడంతో కారుకొండ గేట్‌, యన్మనగండ్ల గేట్‌, తాళ్లవాగు ప్రాంతంలో గోతులు పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో జడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రవీందర్‌రెడ్డి, ఎంపీపీ అనంతయ్య, మాజీ ఎంపీపీ నర్సింహులు విన్నపం మేరకు ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి మిగిలిపోయిన రహదారిపై రీబీటీ వేయించేందుకు రూ.70 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి తెలి పారు. దీంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-12-28T03:02:40+05:30 IST