క్షణాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి
ABN , First Publish Date - 2020-12-30T03:11:12+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల పక్రియ క్షణాల్లో పూర్తయ్యేలా ఏర్పాటుచేసిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
గోపాల్‌పేట, డిసెంబరు 29: రాష్ట్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల పక్రియ క్షణాల్లో పూర్తయ్యేలా ఏర్పాటుచేసిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి మంత్రితో పాటు ఎంపీ రాములు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రైతులను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా రిజిస్ట్రేషన్లు పూర్తిచేస్తున్న తహసీల్దార్ నరేందర్‌ను మంత్రి, ఎంపీ ఘనంగా సన్మానించారు. పలుగ్రామాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు. శ్రీనివాసులు, సంధ్యా, భార్గవి, లోడె రఘు, శేఖర్, తిరుపతియాదవ్, బాలరాజు, కేతమ్మ, మతిన్, కోటీశ్వర్‌రెడ్డి, గాజుల కోదండం, కాశీనాథ్, మన్నెంనాయక్, వెంకటస్వామి, గోపాల్, వెంకటేష్ ఉన్నారు.