-
-
Home » Telangana » Mahbubnagar » rdo office dignjandha farmers
-
ఆర్డీఓ కార్యాలయం దిగ్బంధం
ABN , First Publish Date - 2020-12-16T04:13:39+05:30 IST
మరికల్‌లో తమ భూములను ప్రభు త్వం తీసుకోవద్దని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రైతులు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు.

నారాయణపేటటౌన్, డిసెంబరు 15 : మరికల్‌లో తమ భూములను ప్రభు త్వం తీసుకోవద్దని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రైతులు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల తహసీల్దార్ స్పందించి ఆర్డీఓతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీఇచ్చి దీక్షను విరమింప జేయించారని ఆయన అన్నారు. రైతులు ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించడంతో తహసీల్దార్ తిరుపతయ్య స్పందించి ఉదయం ఆర్డీఓతో చర్చించి సమస్యను పరిష్కరించుకుందామని హామీఇవ్వడంతో రైతులు ధర్నాను విమరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపా ల్, సీపీఐ జిల్లా కార్యదర్శి కొండన్న, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా నాయకుడు రాజు, వెంకటేష్, రాజ మల్లేష్, మల్లప్ప, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.